News
News
X

Mla Sayanna Final Rites : నిలిచిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు, అధికారిక లాంఛనాలతో చేయాలని అభిమానుల ఆందోళన

Mla Sayanna Final Rites : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను ఆయన అభిమానులు అడ్డుకున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ఆందోళనకు దిగారు.

FOLLOW US: 
Share:

Mla Sayanna Final Rites : కంటోన్మెంట్ ఎమ్మెల్యే  సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. సాయన్న అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేయాలని అభిమానులు ఆందోళన దిగారు. పోలీసుల గౌరవ వందనం కూడా లేదని సాయన్న అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మారేడ్ పల్లి స్మశాన వాటికలో అంత్యక్రియలను సాయన్న అభిమానులు అడ్డుకున్నారు. అధికారిక లాంఛనాలతో చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాయన్న అమర్ రహే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

అధికారిక లాంఛనాలపై వెలువడని ఆదేశాలు 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల్లో గందరగోళం నెలకొంది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలో నిర్వహిస్తామని సీఎస్ నిన్న ప్రకటించారు. అయితే ఆదివారం కావడంతో ఆదేశాలు వెలువడలేదని తెలుస్తోంది. ఇవాళ కూడా సీఎస్ ఆదేశాలు రాకపోవడంతో జీఏడీ అధికారిక లాంఛనాలు చేయలేదు. అలాగే చివరి నిమిషంలో స్మశాన వాటిక మార్పు  కూడా కొంత గందరగోళానికి దారితీసినట్లు తెలుస్తోంది. 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే కన్నుమూత 

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న ఆదివారం కన్నుమూశారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నెల 16న గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ పరిస్థితి విషమించడం, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా నిధుల కొరతతో పాటు పార్టీ అంతర్గత విషయాల పట్ల ఎమ్మెల్యే సాయన్న కలత చెందుతున్నారని సమాచారం.

సాయన్న ప్రస్థానం 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న 1951 మార్చి 5న సాయన్న, భూదేవి దంపతులకు హైదరాబాదులోని చిక్కడపల్లిలో జన్మించాడు. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ (బిఎస్సీ), 1984లో ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. సాయన్నకు గీతతో వివాహం జరిగింది. వీరికి సంతానం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోవడం, కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబసభ్యులు సాయన్నను యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆదివారం మధ్యాహ్నం సీనియర్ నేత సాయన్న కన్నుమూశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల పార్టీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

పొలిటికల్ కెరీర్ 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నగరంలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గంగా మారిందంటే ఎమ్మెల్యే సాయన్న పరిపాలన, మంచితనమే కారణమని చెబుతుంటారు. కానీ అనూహ్యంగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిచెందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సమీప అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ప్రస్తుత బీఆర్ఎస్)  గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అది ఆయనకు నాలుగో విజయం. మరుసటి ఏడాది 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు.

Published at : 20 Feb 2023 06:50 PM (IST) Tags: Secunderabad Final rites Funeral BRS Protest Mla sayyanna

సంబంధిత కథనాలు

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

D Srinivas Resign : కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీఎస్ రాజీనామా, నన్ను వివాదాల్లోకి లాగొద్దని లేఖ

D Srinivas Resign : కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీఎస్ రాజీనామా, నన్ను వివాదాల్లోకి లాగొద్దని లేఖ

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

టాప్ స్టోరీస్

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత