(Source: ECI/ABP News/ABP Majha)
Chinna jeeyar Controversy : మేడారం వనదేవతలపై చినజీయర్ అనుచిత వ్యాఖ్యలు - భగ్గుమన్న గిరిజన నేతలు !
సమ్మక్క - సారలమ్మల జాతర వ్యాపారం అంటూ చినజీయర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. క్షమాపణ చెప్పాలని .. తెలంగాణ ప్రభుత్వం చర్య తీసుకోవాలని గిరిజన నేతలు కోరుతున్నారు.
అధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి వివాదంలో ఇరుక్కున్నారు.ఆయన వనదేవతలు సమ్మక్క, సారక్కలపై చేసిన వ్యాఖ్యల వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత… గ్రామదేవత… అక్కడుండేవాళ్లు చేసుకోనీ, సరే… చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు… ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండీ ఇప్పుడు… అది వ్యాపారమైపోయింది ఇప్పుడు… ఎంత అన్యాయం..? అది ఒక చెడు… కావాలనే దీన్ని వ్యాపింపజేస్తున్నారు సమాజంలో…’’ అంటూ ఆ వీడియోలో చినజీయర్ స్వామి వన దేవుతల్ని కించ పరిచేలా మాట్లాడారు.
Chinna Jeeyar is a fraud. Saying it for nth time.pic.twitter.com/eVaGWzXRsb
— Gappa™ 🦜 (@GappaTG) March 15, 2022
అయితే చినజీయర్ స్వామి మాట్లాడిన వీడియో ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల క్రితం ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో ఆయన ఇచ్చిన ప్రసంగాల వీడియో అది. అప్పట్లో రోజువారీగా ఆయన ప్రవచనాలు అందులో ప్రసారమయ్యేవి. అప్పట్లో ఎలాంటి వివాదం కాలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆ వీడియో వైరల్ కావడంతో చినజీయర్‌పై సమ్మక్క-సారలమ్మ భక్తులు భగ్గుమంటున్నారు.
ఆంధ్రా చినజీయర్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరితమైన మాట్లాడారని ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశార.ు ”మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు. కానీ.. మీరు పెట్టిన 120 కిలోల బంగారు సమతా మూర్తి విగ్రహం చూసేందుకు రూ.150 ధర పెట్టారు. మీదే బిజినెస్ అని విమర్శలు గుప్పించారు. లక్ష రూపాయలు తీసుకోకుండా ఏదైనా పేదవారి ఇంటికి మీరు వెళ్ళారా అని చినజీయర్‌ను సీతక్క ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయిన చిన జీయర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి. తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
Chinna Jeeyar is a fraud. Saying it for nth time.pic.twitter.com/eVaGWzXRsb
— Gappa™ 🦜 (@GappaTG) March 15, 2022
సీపీఐ నేత నారాయణ కూడా మేడారాన్ని ఆదివాసీలు పవిత్ర స్థలంగా భావిస్తారని సమ్మక్క, సారలమ్మను తేలిగ్గా మాట్లాడడం సబబు కాదన్నారు. చినజీయర్ క్షమాపణలు చ ెప్పాలన్నారు. చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు మేడారం సమ్మక్క సారలమ్మల పూజారి రఘుపతి రడిమాండ్ చేశారు. చినజీయర్ సమతామూర్తిని దేవుడిలా ఎలా పూజిస్తున్నారో తాము కూడా సమ్మక్క, సారలమ్మను పూజిస్తున్నామన్నామని చెబుతున్నారు. చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మాంసాహారం తినేవారి విషయంలో..అలాగే కులాల విషయంలనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.