Land Issues In Telangana: భూ సమస్యలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం - జూలై 15 నుంచి రెవెన్యూ సదస్సులకు ఆదేశం
Revenue Meetings In Telangana: భూ సమస్యలు పరిష్కారం చేయడానికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
KCR sets up teams to end land rows: తెలంగాణలో ఇది వరకే సమగ్ర భూ సర్వే నిర్వహించారు. అయితే రాష్ట్రంలో ఇంకా అక్కడో, ఇక్కడో మిగిలివున్న భూ సమస్యలు పరిష్కారం చేయడానికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో భూ సమస్యలపై మంగళవారం నాడు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు శేషాద్రి, రిజ్వి, రాహుల్ బొజ్జా తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో భూ సమస్యలు, ధరణి పోర్టల్ సమస్యలపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
100 బృందాలను ఏర్పాటు చేయండి.. కేసీఆర్
మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సు జూలై 11వ తేదీన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆన్‌లైన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లకు వచ్చిన భూ సమస్యల దరఖాస్తులు, వాటి పరిష్కారం, ఇదివరకే సమస్యలో ఉన్న భూముల అంశంలో పురోగతి లాంటివి తెలుసుకోవాలని అధికారులకు సీఎస్ సోమేష్ కుమార్ సూచించనున్నారు.
మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) July 5, 2022
కొనసాగుతున్న రైతుబంధు నగదు జమ..
ఇటీవల నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు (Rythu Bandhu Money) పంపిణీని టీఆర్ఎస్ సర్కార్ వారం రోజుల కిందట మొదలుపెట్టింది. ఈ సీజన్‌కుగానూ రాష్ట్రంలో 68,94,486 మంది (68 లక్షల 94 వేల 486 మంది) రైతులకు రైతు బంధు వర్తిస్తుంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా అన్నదాతలకు పంట సాయం అందిస్తుంది. ఈ ఏడాది Telangana Budget లో రైతుల రుణమాఫీకి భారీగా నిధులు కేటాయింపులు చేశారు. మొత్తం పంటరుణాల ద్వారా 5లక్షల 12వేల మందికి రైతులకు లబ్ది చేకూరనుంది.
Also Read: Rythu Bandhu Money Status: అన్నదాతల అకౌంట్లోకి రైతుబంధు నగదు జమ - మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి