By: ABP Desam | Updated at : 28 Jun 2022 02:08 PM (IST)
అన్నదాతల అకౌంట్లోకి రైతుబంధు నగదు జమ (Photo Source: PTI)
Rythu Bandhu Scheme Money Credited to Farmer Accounts, Check Rythu Bandhu Money Status here
Rythu Bandhu scheme: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇటీవల నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు (Rythu Bandhu Money) పంపిణీని టీఆర్ఎస్ సర్కార్ మంగళవారం మొదలుపెట్టింది. ఈ సీజన్‌కుగానూ రాష్ట్రంలో 68,94,486 మంది (68 లక్షల 94 వేల 486 మంది) రైతులకు రైతు బంధు వర్తిస్తుంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా అన్నదాతలకు పంట సాయం అందిస్తుంది.
నేడు వారి ఖాతాల్లోకి నగదు జమ..
నేటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ కానుండగా, నేడు ఎకరాలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు నగదు జమ అవుతుంది. ఎకరాకు రూ.5 వేలు చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలో మొత్తం 1.53 కోట్ల ఎకరాలకు, ఈ ఏడాది రైతు బంధు వర్తిస్తుండగా... కొత్తగా 1.50 లక్షల ఎకరాల భూమి రైతుబంధు లబ్ధి పొందే జాబితాలో చేరింది. ఎకరంలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేడు రూ. 586 కోట్లు జమ అవుతాయి. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను (Agri Culture Extension Officer) సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది.
రైతు బంధు అర్హుల జాబితాలో మీరు ఉన్నారా..
రైతు బంధు నగదు జమ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018, మే 10న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు. తొలిసారిగా ధర్మరాజుపల్లి వాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్ పాసు పుస్తకాలు అందుకున్నారు. అప్పటినుంచి రాష్ట్రంలో రైతు బంధు కొనసాగుతుండగా.. నేడు రైతులకు 9వ విడుత నగదు సాయం ప్రారంభించారు.
Cotton Farmers News: పత్తి రైతుల పుట్టి ముంచుతున్న అధిక వర్షాలు, ఏం చేసేది?
Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్
Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా
Onion Crop: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు, కానీ అది కూడా వారిని ఆగం చేసింది!
Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు