అన్వేషించండి

Revanth To Delhi : ఢిల్లీకి రేవంత్ - మూడు పెండింగ్ సీట్ల అభ్యర్థులను ఫైనల్ చేసే చాన్స్ !

Telangana News : మూడు పెండింగ్ సీట్ల అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లారు. ఖమ్మం అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

CM Revanth In Delhi :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.  ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.   14 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మరో మూడు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.                                        

ఖమ్మం సీటు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఖమ్మంలో మిత్రపక్షం సీపీఐతో కలిసి అన్ని చోట్ల విజయం సాధించారు.   ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది.మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్‌కు ఖమ్మం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ కోసం అధిష్ఠానాన్ని కలిశారు.   సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి టికెట్‌ ఇస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.                       

కరీంనగర్ ఎంపీ టికెట్‌ విషయంలోనూ కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతోంది. కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్ఠానం కోరగా ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్ లో పడింది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పార్టీ నేత వెల్చాల రాజేందర్‌రావు టికెట్ ఆశిస్తున్నారు.  కరీంనగర్‌లో వెలమ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో..ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది.                  

హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి.  ఇటీవల కాంగ్రెస్‌కు ఎంఐఎం దగ్గర కావడంతో.. పెద్దగా పోటీ ఇవ్వని బలహీన నేతను దింపాలన్న ఆలోచన చేస్తున్నారు.  హిందూ అభ్యర్థిని బరిలోకి దింపితే..మజ్లిస్ రాష్ట్రం మొత్తం మద్దతిస్తుందన్న ఆలోచన చేస్తున్నారు.  ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 10కి పైగా స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.             

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget