CM Revanth Reddy: తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు సహకరించకపోతే పోరాటమే - పదేళ్లు పాలమూరు బిడ్డే సీఎం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి ఏపీ సీఎం సహకరించాలని రేవంత్ అన్నారు. లేకపోతే పోరాటం తప్పదన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సభలో వ్యాఖ్యలు చేశారు.

Telangana Irrigation projects: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. తెలంగాణలో కృష్ణాపై చేపడుతున్న ప్రాజెక్టులకు అడ్డం పడవద్దని సహకరించాలని కోరారు. ప్రాజెక్టుకులకు సహకరించకపోతే పోరాటం చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకోవడం న్యాయం కాదన్నారు. కోయిల్ సాగర్ సహా ఇతర ప్రాజెక్టులను అడ్డుకోవద్దన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు. నాగర్ కర్నూలులో జరిగిన సభలో రేవంత్ ప్రసంగించారు.
TG CM Revanth Reddy appeal to Ap CM Chandrababu Naidu - Stop the Rayalaseema lift irrigation project which takes 3TMC water. If both states are equal to you& telugu people shud develop”
— Naveena (@TheNaveena) July 18, 2025
Don’t object to Kalwakurthy, Bhima, Nettampadu, Dindi, Koilsagar Palamuru Rangareddy projects… pic.twitter.com/oku6AR88i0
పాలమూరు గడ్డ మీద నుంచి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా..దళితుల పిల్లలు వైద్య కళాశాలలో చదువుతుంటే దుఃఖం ఎందుకు వస్తుంది? పాలమూరు - రంగారెడ్డి పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? కల్వకుర్తి, నెట్టెంపాడు ఏమైంది ? అనిప ప్రశ్నించారు. కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వస్తే అన్నం పెట్టిన ఈ ప్రాంత ప్రజలకు సున్నం పెడుతావా ? ప్రజా పాలన చూసి దుఃఖమెందుకు వస్తోంది కేసీఆర్? నల్లమల్ల బిడ్డ సీఎం అయ్యాడని దుఃఖం వస్తుందా చెప్పాలన్నారు. నడిగడ్డలో వరదలు వచ్చినప్పుడు బాధితులకు బంజారాహిల్స్ లో తన ఇల్లు అమ్మి మరీ కట్టిస్తానన్నాడు కేసీఆర్..బంజారాహిల్స్ లో ఇల్లు అమ్మకున్నా సరే, కనీసం బాధితులకు పరిహారం ఇప్పించారా అని నిలదీశారు.
వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు . పదేళ్లలో ఈ సమస్యలను పరిష్కరించి ఉంటే పాలమూరు వాసులు మళ్లీ సమస్యపై కొట్లాడే పరిస్థితి ఉండేది కాదన్నారు. పాలమూరు గడ్డ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయిండని నీకు దుఃఖం వస్తుందా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు 25 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? పాలమూరు బిడ్డ 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నందుకా నీకు దుఃఖం ? నలభై ఏళ్లుగా మాదిగ బిడ్డలు వర్గీకరణ కోసం పోరాడుతుంటే… మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకా నీకు దుఃఖం ? అని ప్రశ్నించారు. నీ కొడుకు, నీ మనుమడిలాగే మాదిగ బిడ్డలు చదువుకుంటున్నందుకా నీకు కళ్లల్లో నీళ్లు వచ్చినయ్ ..పదేళ్లు సీఎం గాఉండి పాలమూరు ప్రాజక్టులను కెసిఆర్ పడావు పెట్టారని ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి ని పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు ..కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు ఎందుకుపూర్తి చేయలేదో చెప్పాలన్నారు. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్లల్లో కూలేశ్వరం అయిందన్నారు. పదేళ్లు నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతున్నామని.. ఎందుకంత కడుపులో విషం పెట్టుకుని మాపై విషం చిమ్ముతున్నావని మండిపడ్డారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి… శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోస్తున్నారని మండిపడ్డారు.
మొదటి ఏడాదిలోనే రూ. 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాదన్నారు. 9 రోజుల్లో 9 వేలకోట్లు రైతులకు రైతు భరోసా ఇచ్చింది మేం కాదా అని ప్రశ్నించారు. కెసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో..2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని స్పష్టం చేశారు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో జటప్రోలులో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి మాట్లాడారు. ఈ స్కూల్ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించడం, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాల ద్వారా విద్యా అవకాశాలను మెరుగుపరచడం, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.





















