అన్వేషించండి

Telangana Budget : ఓటాన్ అకౌంట్‌కే రేవంత్ సర్కార్ మొగ్గు - లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తి బడ్జెట్ !

Revanth Reddy : ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ఈ సారి ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై స్పష్టత ఉండే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Telangana Budget :   తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోంది. లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఏడాది మొత్తం బడ్జెట్ పెట్టే వీలు  లేదు. అందుకే ఓటాన్ అకౌంట్ పద్దునే ప్రవేశ పెడతారు. ఇందులో తాత్కాలిక కేటాయింపులే ఉంటాయి. పూర్తి బడ్జెట్ లో రాష్ట్రాలకు కేటాయించే గ్రాంట్లపై స్పష్టత వస్తుంది. అందుకే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి  పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాతనే తెలంగాణనూ  బడ్జెట్ పెట్టాలని అనుకుంటున్నారు. ముందుగా ఓటాన్ అకౌంట్ పెట్టాలని భావిస్తున్నారు. 

ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం  

 రేవంత్‌ సర్కార్‌ కూడా ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్‌ను, ఎలక్షన్ల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఫిబ్రవరిలో రానుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టటం సాధ్యం కాదు. అయితే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో తీసుకుని, అందుకనుగుణంగానే పద్దును రూపొంది స్తున్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో జీతాలు, భత్యాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు  కోసం ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టి, శాసనసభ అనుమతి తీసుకోనున్నారు. ఎన్నికల తర్వాత మరోసారి అన్ని శాఖల పద్దులను క్రోడీకరించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. 

ఆరు గ్యారంటీలకు నిధుల సమీకరణ కీలకం                                      

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ప్రస్తుతానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు అమలవుతున్న సంగతి తెలిసిందే. మిగతా గ్యారెంటీల అమలు ఎన్నికల తర్వాతే ఉంటుందంటూ ఉన్నతాది óకారులు చెబుతున్నారు. వాటిని అమలు చేయాలంటే నిధులు సమకూర్చుకోవాలి, నియమ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోకి దిగి, లబ్దిదారులను ఎంపిక చేయాలి. ఇప్పటికే ప్రజా పాలన పేరిట దరఖాస్తులను స్వీకరించినప్పటికీ వాటి పరిశీలనకు మరింత సమయం పట్టే అవకాశముంది. అందువల్ల మిగతా గ్యారెంటీలన్నీ అమలు కావాలంటే లోక్‌సభ ఎన్నికలు అయ్యేంత వరకూ వేచి చూడక తప్పదని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. 

గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి 

 ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని పట్టుబడుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌, ఓటాన్‌ అకౌంట్‌ పేరిట హామీలను విస్మరించకూడదంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామంటూ చెబుతున్న ప్రభుత్వం… అందుకోసం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నదో చూడాలి. ఆర్థిక వేత్తలు, నిపుణులు మాత్రం…’కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు’ అనేవి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినవి కాబట్టి, అవి ‘ఆన్‌ గోయింగ్‌’ పరిధిలోకి వస్తాయి…’ అని చెబుతున్నారు. అందువల్ల ఆయా పథకాలకు నిధులు కేటాయిస్తే, వాటిని అమలు చేయ టానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అభిప్రాయ పడుతున్నారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
Sabarimala Yatra History:  శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Embed widget