Revanth Reddy: డబ్బుల్లేకపోతే సచివాలయం, ప్రగతి భవన్ అమ్మేయండి.. మేం మద్దతిస్తాం: రేవంత్ రెడ్డి

ఇందిరాభవన్‌లో శనివారం తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సహా పార్టీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

FOLLOW US: 

తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాల్సిందేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలతో పాటు గిరిజనులకు కూడా రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు. అవసరమైతే డబ్బుల కోసం ప్రగతి భవన్‌ను, సచివాలయాన్ని కూడా అమ్మేయాలని, అందుకు తాము కూడా మద్దతు ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇందిరాభవన్‌లో శనివారం (జులై 31) తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలైన సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, అంజన్‌కుమార్‌ యాదవ్‌, గీతారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Also Read: Bhadradri Kothagudem: వ్యాపారి సూసైడ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు పేరు... మరి వివాదంపై వనమా రియాక్షన్ ఏంటి?

‘‘దళిత బంధు పథకాన్ని ఎవడు ఆపుతడో చూస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటున్నడు. ఎవ్వడూ ఆపడం లేదు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ దళిత బంధును అమలు చేయాలనే డిమాండ్‌ చేస్తున్నం. తాను మాట ఇస్తే అమలు చేసి తీరుతానంటూ కేసీఆర్‌ అంటున్నరు. రాష్ట్రంలో దళితులను మోసం చేసింది ఆయన కాదా? లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలోనూ దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహించనున్నాం. ఒక ప్రతి నియోజకవర్గంలో లక్ష మందితో ఈ సభలను పెట్టి రూ.10 లక్షలు ఇస్తావా.. చస్తావా అంటూ డిమాండ్ చేస్తాం. దీంతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో చావు డప్పు మోగిస్తాం’’ అని తెలిపారు. అనంతరం నాంపల్లిలోని కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీలకు సీఎం కేసీఆర్‌ చేసిందేమీ లేదని కొట్టిపారేశారు.

ప్రభుత్వానికి దళిత బంధుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును అమలు చేస్తామని ఏకవాక్య తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి మరో విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు.

సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో దళిత, గిరిజనులకు పంపిణీ చేసిన భూమిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అటవీ భూములకు సంబంధించి కాంగ్రెస్‌ హయాంలో చేసిన చట్టాలు అమలయ్యేలా పోరాటం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. హరితహారం పేరుతో గిరిజన భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్‌ చెప్పిందేమీ ఇంతవరకు జరగలేదని గీతా రెడ్డి అన్నారు. జానారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నేత సంపత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. 

Also Read: KCR NO ELECTION : హుజూరాబాద్ ఉపఎన్నికను కేసీఆర్ కోరుకోవట్లేదు..! ఇదిగో సాక్ష్యం..!

Published at : 01 Aug 2021 07:04 AM (IST) Tags: revanth reddy CM KCR News revanth reddy news Dalitha Bandhu telangana telangana congress news

సంబంధిత కథనాలు

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

KTR London Tour : తెలంగాణ సక్సెస్ ఇండియా సక్సెస్ - ప్రపంచమంతా చాటాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్

KTR London Tour : తెలంగాణ సక్సెస్ ఇండియా సక్సెస్ - ప్రపంచమంతా చాటాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం