By: ABP Desam | Updated at : 18 May 2023 05:20 PM (IST)
ఓ మెట్టు దిగుతా అందరూ వచ్చేయండి - మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ పిలుపు !
Revant Reddy : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతలు మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ప్రారంభం కావడంతో నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీని వీడిపోయిన వాళ్లందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీలు వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావాలన్నారు. ఈటల రాజేందర్ కూడా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు.
తన వల్ల ఇబ్బంది అవుతుందనుకుంటో ఓ మెట్టు దిగుతానన్న రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే... ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారని ..అయితే రేవంత్ రెడ్డి సారీ చెబితే చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి తాను ఓ మెట్టు దిగడానికి సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మార్పు వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఖండించారు.
వీహెచ్ కామెట్స్ సీరియస్‌గా తీసుకున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ బీసీ నేతలు- 3 స్థానాలు కావాలంటూ డిమాండ్!
మోదీ బ్రాండ్‌కు కాలం చెల్లిందన్న రేవంత్ రెడ్డి !
కర్ణాటకలో చక్రం తిప్పాలని చూసిన కేసీఆర్ నడుములు విరగొట్టారని, కేసీఆర్, మోదీ వేరు వేరు కాదని రేవంత్ అన్నారు. జేడీఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నించారని, కర్ణాటకలో బీజేపీ చేసిందే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కర్ణాటక ఫలితాలను దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారని మోదీ విధానాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు నిలబడ్డారని కొనియాడారు. కర్ణాటక ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెట్టిందని, మోదీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధం లేనివాళ్ళు కూడా కర్ణాటక ప్రజలను అభినందించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణకు అమెరికా వైద్య పరికరాల దిగ్గజం - రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మెడ్ ట్రానిక్స్ !
త్వరలో బీసీ గర్జన !
త్వరలోనే బీసీ పాలసీ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీ గర్జన నిర్వహించాలని పార్టీ ఆదేశించిందని, బీసీలకు వ్యతిరేకంగా గతంలో బీజేపీ ఉద్యమం చేసిందని మండిపడ్డారు. మోదీని ప్రధాని చేస్తే బీసీల కడుపు నిండదన్నారు. పదవి పోయే ముందు బీజేపీకి బీసీలు గుర్తుకొస్తున్నారా? అని ప్రశ్నించారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. మోదీని ఓడించడానికి కాంగ్రెస్ నాయకత్వం అవసరమని దేశంలోని అన్ని పార్టీలు అనుకుంటున్నాయన్నారు.
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
Warangal News: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది: దాస్యం వినయ భాస్కర్
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్