అన్వేషించండి

Revanth Reddy in Delhi: మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు

Telangana CM: పునర్విభజనతో ముడిపెట్టకుండా మహిళా బిల్లు తేవాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీకి ఎప్పుడూ చిన్నచూపేనని ఢిల్లీలో మండిపడ్డారు.

Women  Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ , ఇండియా కూటమి కారణమని చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్లను  నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం వల్లనే తాము అడ్డుకున్నామని స్పష్టం చేశారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ బిల్లును సవరించండి. కేవలం 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక బిల్లును సోమవారం నాటికి తీసుకురండి, మేము వెంటనే మద్దతు ఇచ్చి పాస్ చేస్తాం అని కేంద్రానికి సవాల్ విసిరారు. మహిళా బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించాలనే కుట్రను సహించబోమని తేల్చిచెప్పారు. 
 
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాధాన్యతను కోల్పోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 30-50 ఏళ్లుగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు మాకు శిక్ష వేస్తారా  అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు,  ఇతర దక్షిణాది నేతల ఆలోచనలు కూడా ఇదే దిశలో ఉన్నాయని, ప్రాంతీయ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.    

జనాభా నియంత్రణ, దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సమర్థించారు. చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వారు, అపార అనుభవం గల నేత. ఆయన ఏదీ తప్పుగా చెప్పరు  అని రేవంత్ ప్రశంసించారు. జనాభాను పెంచుకోవాలంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు వెనుక పెద్ద వ్యూహం ఉందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై ఆయన నేరుగా కాకపోయినా సంకేతాల  ద్వారా తన నిరసనను తెలిపారని రేవంత్ విశ్లేషించారు  సమజ్దార్ కో ఇషారా కాఫీ హై  తెలివైన వారికి చిన్న సంకేతం చాలు అంటూ ఎన్డీయే మిత్రపక్షాల్లోనే అసంతృప్తి మొదలైందని రేవంత్ చెప్పుకొచ్చారు.  

  
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించేలా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.  ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టు మీద మేస్తుందా  అని ప్రశ్నించారు.  గతంలో ప్రధాని మోదీ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను వేరు చేయడం తో పోల్చిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్దలే అలా మాట్లాడినప్పుడు, కింద ఉన్న నేతలు అలాగే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా, ఓటింగ్ సమయంలో తలుపులు మూయడం అనేది ఒక ప్రాథమిక ప్రక్రియ అని, దానిని అవమానంగా చిత్రీకరించడం అజ్ఞానమేనని కొట్టిపారేశారు.   రేవంత్ రెడ్డి  అటు బీజేపీపై పోరాటాన్ని, ఇటు చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని సమన్వయం చేసుకుంటూ, దక్షిణాది సెంటిమెంట్‌ను బలంగా వినిపించారు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget