Ramoji Foundation: ఐఎస్‌బీకి రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం - అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మాణం
Hyderabad News: ఐఎస్‌బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)కు రామోజీ ఫౌండేషన్ రూ.30 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఆడిటోరియం నిర్మాణానికి ఈ సొమ్మును ఐఎస్‌బీ వినియోగించనుంది.
Ramoji Foundation Donated Funds To ISB: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)కు రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ రూ.30 కోట్ల విరాళాన్ని ఐఎస్‌బీ ప్రతినిధులకు అందజేశారు. ఆడిటోరియం నిర్మాణానికి ఈ సొమ్మును ఐఎస్‌బీ వినియోగించనుంది. 430 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆడిటోరియం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ ఛైర్మన్ హరీశ్ మన్వానీ రామోజీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభ్యాసం, పరిశోధన కోసం ప్రపంచ స్థాయి సంస్థగా ఉండాలనే ISB దృక్పథాన్ని నిజం చేయడంలో రామోజీ ఫౌండేషన్ ముఖ్యమైన పాత్ర పోషించిందని అన్నారు. కాగా, రామోజీ ఫౌండేషన్ అందించిన భారీ విరాళం పాఠశాల అభివృద్ధిలో గణనీయంగా సహాయపడుతుందని.. తాము ప్రపంచ స్థాయి అభ్యాస అనుభవాలను అందించడాన్ని కొనసాగిస్తామని ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు.
రామోజీ రావు గారి స్మృతిని గౌరవించడంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మరింత ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో ఈ విరాళం సహాయం చేస్తుందని రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్. కిరణ్ తెలిపారు. ఇందులో ఆడిటోరియం నిర్మాణం ద్వారా అకడమిక్ చర్చలకు, విజ్ఞాన వేదికలకు కేంద్ర బిందువుగా మారుతుందని అన్నారు. ISB గ్లోబల్ B స్కూల్‌గా నిలవడానికి శాశ్వతమైన నిదర్శనంగా ఉపయోగపడుతుందని చెప్పారు.
టాప్ బిజినెస్ స్కూల్
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) అనేది హైదరాబాద్, మొహాలి క్యాంపస్‌లలో వినూత్న నిర్వహణ విద్యను అందించే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బిజినెస్ స్కూల్. టాప్ గ్లోబల్ బిజినెస్ స్కూల్స్‌లో ర్యాంక్ పొందింది. ISB ఫ్లాగ్‌షిప్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (PGP), ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ మరియు డాక్టోరల్ ప్రోగ్రామ్‌లతో సహా ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ప్రపంచ స్థాయి అధ్యాపకులు, ఆలోచనా నాయకత్వం ద్వారా ఐఎస్‌బీ ఉత్తమ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తుంది. ఈ క్రమంలోనే ఐఎస్‌బీకి రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. 2012లో స్థాపించబడిన ఈ ఫౌండేషన్, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనాథ శరణాలయాలు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, క్రీడల శిక్షణ, అభివృద్ధికి తోడ్పడే రంగాల్లో గ్రూప్ తరఫున ధాతృత్వ కార్యకలాపాలు, CSR కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తోంది. ఫౌండేషన్ ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, జీనోమ్ ఫౌండేషన్, అక్షయపాత్ర, బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ మొదలైన వాటికి గణనీయమైన కృషి చేసింది.
Also Read: Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు