Sahitya Akademi 2024 Yuva Puraskar: సాహిత్య అకాడమీ యువ పురస్కారం, బాల పురస్కారాల విజేతలు వీరే - తెలుగు వారికి 2 అవార్డులు
Sahitya Akademi Yuva Puraskar| తెలంగాణ వాసి రమేష్ కార్తీక్ నాయక్‌ను సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. ఆయన రాసిన ఢావ్లో'- గోర్ బంజారా కథల సంకలనానికిగానూ అవార్డు అందుకోనున్నారు.
Ramesh Karthik Nayak Wins Sahitya Akademi Yuva Puraskar | న్యూఢిల్లీ: ఆంగ్ల రచయిత్రి కె వైశాలి, హిందీ రచయిత గౌరవ్ పాండే సహా ప్రతిష్టాత్మకమైన యువ పురస్కారాన్ని అందుకోనున్న 23 మంది రచయితల పేర్లను సాహిత్య అకాడమీ శనివారం (జూన్ 15న) ప్రకటించింది. సంస్కృతంలో యువ పురస్కార విజేతను త్వరలో ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. యువ పురస్కారానికి ఎంపికైన వారికి ఓ తామ్ర పత్రంతో పాటు రూ. 50,000 చెక్కును అందజేస్తారు. అదే సమయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ 2024 ఏడాదికిగానూ 24 మంది బాల సాహిత్య పురస్కార విజేతల జాబితాను ప్రకటించింది.
2024 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్ ఉన్నారు. ఢావ్లో'- గోర్ బంజారా కథల సంకలనానికి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన రమేష్ కార్తీక్ నాయక్‌ను మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
'ఢావ్లో'- గోర్ బంజారా కథల సంకలనానికి 2024 సంవత్సర కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ బిడ్డ రమేష్ కార్తీక్ నాయక్ కు అభినందనలు pic.twitter.com/rdT0bCpBwK
— KTR (@KTRBRS) June 15, 2024
శనివారం విజేతల్ని ప్రకటించిన ఎగ్జిక్యూటివ్ బోర్డు
సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన శనివారం జూన్ 15న జరిగిన మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ బోర్డు 23 మంది రచయితలను యువ పురస్కారానికి ఎంపిక చేసింది. సంబంధిత భాషలో ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూరీ చేసిన సిఫార్సులను ఆధారంగా చేసుకుని సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి వీరిని ఎంపిక చేశారు. ఇంగ్లీష్ రచయిత్రి కె వైశాలి 'హోమ్‌లెస్: గ్రోయింగ్ అప్ లెస్బియన్ అండ్ డైస్లెక్సిక్ ఇన్ ఇండియా' అనే రచనకు, గౌరవ్ పాండే తన కవితా సంకలనం 'స్మృతియోం కే బీచ్ గిరి హై పృథ్వీ' ('Smritiyon Ke Beech Ghiri Hai Prithvi')కిగానూ ప్రతిష్టాత్మక యువ పురస్కారాలను కైవసం చేసుకున్నారు.
ఓవరాల్‌గా చూస్తే 10 కవితా పుస్తకాలు, 7 కథా సంకలనాలు, 2 వ్యాస సంకలనాలు, ఒక వ్యాసం, ఒక నవల, ఒక గజల్స్ పుస్తకం, ఒక జ్ఞాపికకు సంకలనానికి యువ పురస్కారం ప్రకటిస్తారు.
యువ పురస్కారం పొందిన విజేతలు వీరే.
రమేష్ కార్తీక్ నాయక్ (తెలుగు)
శ్రుతి బి ఆర్ (కన్నడ)
శ్యాంకృష్ణ ఆర్ (మలయాళం)
లోకేష్ రఘురామన్ (తమిళం)
జావేద్ అంబర్ మిస్బాహి (ఉర్దూ)
నయంజ్యోతి శర్మ (అస్సామీ)
సుతాప చక్రవర్తి (బెంగాలీ)
సెల్ఫ్ మేడ్ రాణి బారో (బోడో)
రింకీ ఝా రిషిక (మైథిలి)
హీనా చౌదరి (డోగ్రీ)
అద్వైత్ సల్గాంకర్ (కొంకణి)
రింకు రాథోడ్ (గుజరాతీ)
మహ్మద్ అష్రఫ్ జియా (కాశ్మీరి)
దేవిదాస్ సౌదాగర్ (మరాఠీ)
వైఖోమ్ చింగ్‌ఖీంగన్‌బా (మణిపురి)
రణధీర్ (పంజాబీ)
సంజయ్ కుమార్ పాండా (ఒడియా)
సోనాలి సుతార్ (రాజస్థానీ)
అంజన్ కర్మాకర్ (సంతాలి)
గీతా ప్రదీప్ రూపానీ (సింధీ)
సూరజ్ చపగైన్ (నేపాలీ)
బాల పురస్కారం విజేతలకు ఇచ్చేది ఇదే
2024 ఏడాదికిగానూ 24 మంది రచయితల్ని బాల పురస్కారానికి ఎంపిక చేశారు. అందులో 7 నవలలు, 6 కవితా సంకలనాలు, 4 కథలు, 5 చిన్న కథలు, ఒక నాటకం, ఒక చారిత్రక నవల రచనలకుగానూ ఈ ప్రతిష్టాతక బాల పురస్కారం ప్రకటించారు. విజేతలకు ఓ తామ్ర పత్రంతో పాటు రూ.50 వేల చెక్కును అందజేయనున్నారు.
(Bal Sahitya Puraskar Winners List) బాల సాహిత్య పురస్కార విజేతలు వీరే
పి చంద్రశేఖర్ ఆజాద్ (తెలుగు)
రంజు హజారికా (అస్సామీ)
దీపన్వితా రాయ్ (బెంగాలీ)
బిర్గిన్ జెకోవా మచాహరి (బోడో)
బిషన్ సింగ్ 'దర్ది' (డోగ్రీ)
గిరా పినాకిన్ భట్ (గుజరాతీ)
కృష్ణమూర్తి బిలిగెరె (కన్నడ)
ఉన్ని అమ్మాయంబలం (మలయాళం)
యువ వాసుకి (తమిళం)
భారత్ ససనే (మరాఠీ)
క్షేత్రమయూన్ సుబాదాని (మణిపురి)
ముజఫర్ హుస్సేన్ దిల్బర్ (కాశ్మీరి)
నారాయణగీ (మైథిలి)
మానస్ రంజన్ సమల్ (ఒడియా)
హర్ష సద్గురు శెట్యే (కొంకణి)
షంసుల్ ఇస్లాం ఫరూఖీ (ఉర్దూ)
కుల్దీప్ సింగ్ దీప్ (పంజాబీ)
ప్రహ్లాద్ సింగ్ 'జోర్డా' (రాజస్థానీ)
లాల్ హాట్‌చందానీ 'లాచార్' (సింధీ)
హర్షదేవ్ మాధవ్ (సంస్కృతం)
దుగల్ తుడు (సంతాలి)
బసంత థాపా (నేపాలీ)