News
News
వీడియోలు ఆటలు
X

Karimnagar News: ఉగాది పండుగ చేసుకునే పరిస్థితి లేదు, నష్టపోయిన పంటల్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటల

వడగళ్ల వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

Karimnagar News :   అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాలకు రూ. యాభై వేల పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రైతులు  ఉగాది పండుగ చేసుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంతో హుజూరాబాద్ పల్లెల్లో విషాదఛాయలు అలుముకున్నాయని.. కెసిఆర్ గారు ఎక్కడో..పంజాబ్ రైతులకు డబ్బులు ఇచ్చి వచ్చుడు కాదు.. ఈ గడ్డమీద ఏడుస్తున్న రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరాకు 50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. మీ  సమీక్షలు కడుపు నింపవు .. ముసలికన్నీరు కాదు కావాల్సిందన్నారు.  రేకుల, పెంకుల ఇల్లు కూడా ధ్వంసం అయ్యాయని.. కెసిఆర్ స్పందించకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.  -         

హూజూరాబాద్ నియోజకవర్గంలో  వడగళ్ల వానకు హిమ్మత్ నగర్, రామకృష్ణపూర్, బ్రహ్మనపల్లి, మామిడలపల్లి,కోర్కల్, చల్లుర్, రెడ్డిపల్లే, మల్లారెడ్డి పల్లె, దేశాయ్ పల్లె, కాపుల పల్లె, సీతంపేట వంటి చోట్  రైతులకు కడగండ్లు మిగిలించింది. వేల ఎకరాల మక్క, మిరప తోటలు, వరి పొలాలు.. చేతికి అందిన పంట నేలపాలు అయ్యింది.  ఉగాది పండుగ ఉన్నా పండుగ లేని వాతావరణం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి గారు ఇంతవిపత్తులో కూడా స్పందించలేదని ఈటల రాజేందర్ విమర్శలు గుప్పిస్తున్నార.ు . మంత్రులు క్షేత్ర పర్యటన లేదు. అధికారులు తుతు మంత్రంగా వచ్చిపోతున్నారు తప్ప భరోసా ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చే పంటభీమా పథకం "ఫసల్ భీమా" రాష్ట్రంలో అమలు చెయ్యడం లేదు. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం అందడం లేదు.  పోయిన సంవత్సరం నడికుడ ప్రాంతంలో ఇదే సీజన్లో మిర్చిపంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ఏడాది అయినా ఇవ్వడం లేదని రైతులు అటున్నారు.                  

రైతుబందు ఇస్తున్నామని ఎలాంటి సాయం అందించడం లేదు. గతంలో అనేక వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇచ్చే వారు.  ఇప్పుడు అన్నీ బంద్ పెట్టారని ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎం  ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో కూర్చొని స్పందించరా అని ఈటల ప్రశ్నించారు.  రైతులకు నిజమైనసాయం అందించి ఆదుకోవాలన్నారు. వదేళ్ల క్రితం ఇలాంటి విధ్వంసం జరిగిందన్నారు. రేకుల ఇళ్లు కూడా పాడైపోయాయని ఇళ్ళు పాడయిన వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని  ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.                                        

అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టీ వ్యవసాయం చేస్తున్నామని..  కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  20 ఎకరాల కౌలు చేస్తున్నా.. రైతుబంధు భూ యజమానికి వెళుతుందని పంట న్టం తమకు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.  కౌలు రైతుకు రైతుబంధు అందించాలన్నారు.                           

Published at : 22 Mar 2023 04:02 PM (IST) Tags: Etala Rajender Telangana News Karimnagar News

సంబంధిత కథనాలు

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

TSPSC News : తవ్వకొద్దీ అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

TSPSC News :  తవ్వకొద్దీ  అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

Top 5 Headlines Today: సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి! రైలు ప్రమాద ఘటనపై జగన్, కేసీఆర్ దిగ్భ్రాంతి? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి! రైలు ప్రమాద ఘటనపై జగన్, కేసీఆర్ దిగ్భ్రాంతి? టాప్ 5 హెడ్ లైన్స్

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?