Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ ఈజ్ బ్యాక్ - కానీ ఆ ట్వీట్లేవి ?
Rahul Ramakrishna Twitter : రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అయింది. కానీ వివాదాస్పద ట్వీట్లను తొలగించారు

Rahul Ramakrishna Twitter active But controversial tweets deleted: నటుడు రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అయింది. అయితే దసరా పండుగ రోజున ఆయన చేసిన ట్వీట్లేమీ అందులో లేవు. డిలీట్ చేసి.. ట్విట్టర్ అకౌంట్ ను యాక్టివ్ చేసుకున్నారు. ఎందుకు ఇలా జరిగిందో ఆయన ప్రకటించలేదు. కానీ రాహుల్ రామకృష్ణ పెట్టిన ట్వీట్లు వివాదాస్పదంగా ఉండటంతో తెర వెనుక ఏదో జరిగిందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్క సారి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దసరా పండుగ రోజు X లో వరుసగా పోస్ట్ చేసిన ట్వీట్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. డైరెక్ట్‌గా కాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు మాత్రమే విజ్ఞప్తులు చేశారు. "హైదరాబాద్ మునిగిపోయింది. మీ వాగ్దానాలు అన్నీ విఫలమయ్యాయి. కేసీఆర్ ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతిదాన్నీ క్రమబద్ధీకరించేందుకు రావాలని కోరాడు. ఆ తర్వాత మనం చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము. వేచి ఉండలేను.. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని కేటీఆర్‌ను పిలుస్తూ మరో ట్వీట్ పెట్టారు. కేటీఆర్‌ను 'రక్షకుడిగా' పిలుస్తూ, "ఇప్పుడు నన్ను చంపేయండి, నాకు ఏమీ ఆశ లేదు" అని భావోద్వేగంగా స్పందించారు. తర్వాత మరో ట్వీట్‌లో ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు, మనం మానవులమే.. ప్రేమతో జీవించాలి అని శాంతి సందేశం ఇచ్చాడు.
అంత కంటే ముందు మహాత్మాగాంధీని కూడా కించ పరుస్తూ ట్వీట్లు పెట్టారు. గాంధీ జయంతి కావడంతో ఆయన పెట్టిన ట్వీట్లపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్, రేవంత్ ప్రభుత్వంలపై పెట్టడంతో ఆయన సోషల్ మీడియాలో రోజంతా హాట్ టాపిక్ అయ్యారు. ఈ అంశంపై దసరా పండుగ రోజున ఆయన తర్వాత స్పందించలేదు. కానీ అనూహ్యంగా శుక్రవారం ఉదయం ఆయన అకౌంట్ డీయాక్టివేట్ అయింది. దాంతో ఏదో జరిగిందని అనుకున్నారు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సాయంత్రానికి ఆయన ట్విట్టర్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అయింది కానీ.. మహాత్మాగాంధీ తో సహా ప్రభుత్వంపై పెట్టిన వివాదాస్పద ట్వీట్లేమీ కనిపించడం లేదు.
ఈ అంశంలో ఆయనపై ఉన్నత స్థాయి ఒత్తిడి వచ్చిందని అందుకే ట్వీట్లన్నీ డిలీట్ చేయించారని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకుని రాహుల్ రామకృష్ణను బెదిరించారని అంటున్నారు. మరికొంత మంది గాంధీ జయంతి కావడంతో మద్యం దుకాణాలు మూసివేశారని.. మద్యం దొరక్క అలా పిచ్చిపట్టినట్లుగా పోస్టులు పెట్టారని అంటున్నారు. ఏదైనా.. రాహుల్ రామకృష్ణ మాత్రం ఈ వివాదంపై స్పంందించలేదు.





















