అన్వేషించండి

Rahul Gandhi: కేసీఆర్ ఎంత లూటీ చేసిన డబ్బంతా మీ అకౌంట్లలో వేస్తా - కల్వకుర్తిలో రాహుల్ గాంధీ

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో విజయభేరి యాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దోచుకున్న డబ్బులను కక్కించాలని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు. తెలంగాణకు కేసీఆర్ రాజులాగా వ్యవహరిస్తున్నారని, దొరల తెలంగాణకు ప్రజలకు మధ్య యుద్ధమని అన్నారు. కేసీఆర్ లూటీ చేసిన డబ్బుల్ని మీ అకౌంట్లలో వేసేలా ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో విజయభేరి యాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీపై ఆరోపణలు చేశారు. ‘‘నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని కూడా గుంజుకున్నారు. దాంతో నేను ఆ ఇంటిని సంతోషంగా ఇచ్చేశా. మొత్తం దేశం, తెలంగాణ అంతా నా ఇల్లు. అవసరమైతే కోట్లాది మంది ప్రజలు అక్కున చేర్చుకుంటారు. బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారిపైన ఈడీ, సీబీఐ కేసులు ఉంటాయి. కానీ, బీఆర్ఎస్ పైన ఇలాంటివేమీ ఉండవు. బీజేపీ పెద్దలు తెలంగాణకు వచ్చి ఓబీసీ వ్యక్తిని సీఎంగా చేస్తానంటారు. ఇక్కడ వారికి రెండు శాతం ఓట్లు వస్తే సీఎంని ఎలా చేస్తారు. వీళ్ల తీరు ఎలా ఉందంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఓబీసీ వ్యక్తిని మోదీ అమెరికా వెళ్లి చెప్పినట్లుంది.

మహారాష్ట్ర, రాజస్థాన్, అసోం, ఉత్తర్ ప్రదేశ్ ఎక్కడైనా కాంగ్రెస్ పోటీ చేస్తే, అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షం అవుతారు. వాళ్లంతా అక్కడ బీజేపీ అభ్యర్థులకు సాయపడడానికి వస్తారు. ఈ ఎంఐఎం వాళ్లకు డబ్బులు కూడా బీజేపీనే ఇస్తుంది. అందుకే ఎంఐఎం - బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు ఒకటే శక్తి. తెలంగాణలో బీజేపీ టైర్లు పంచర్ చేసినట్లుగానే కేంద్రంలో కూడా బీజేపీ టైర్లు పంచర్ చేస్తాము. ఇక్కడ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్‌లో కూడా గెలవబోతున్నాం. తర్వాత కేంద్రంలోనూ గెలుస్తాం. అందరం కష్టపడి ఇక్కడ బీఆర్ఎస్‌ను ఓడిద్దాం. జనరల్ ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం’’ అని రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget