(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Pubs Ban: హైదరాబాద్‌లోని పబ్‌లు భయంకరమైన డ్రగ్ డెన్స్, కెరీర్, జీవితాలు నాశనం !
Dasoju Sravan On Pubs Ban: తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా పబ్‌లు, హుక్కా సెంటర్లు, బెల్ట్ షాపులను నిషేధించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ పబ్ నుంచి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆధునికత పేరుతో హైదరాబాద్‌లోని పబ్‌లు భయంకరమైన డ్రగ్ డెన్స్‌గా, అసభ్యత, వికృత సంస్కృతిని పెంచి, యువకుల కెరీర్‌ను నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. మన యువత భవిష్యత్తుతో పాటు సంస్కృతిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా పబ్‌లు, హుక్కా సెంటర్లు, బెల్ట్ షాపులను నిషేధించాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు అరెస్టు
జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో పోలీసులు ఇప్పటిదాకా నలుగురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురిలో ముగ్గురు మైనర్లు కాగా, మరో ఒక వ్యక్తి 18 ఏళ్లు దాటిన మేజర్ అని హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏ - 1 గా సాదుద్దీన్ మలిక్ (ఎంఐఎం నేత కొడుకు), ఉన్నారు. ఇంకా ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు (మైనర్), సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కొడుకు (మైనర్), ఓ ప్రభుత్వ సంస్థకు ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి కొడుకు (మైనర్) నిందితులుగా ఉన్నారు. అరెస్టయిన ఏ - 1 సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మైనర్లను కూడా అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. నిందితులపై 376D, 323, R/W 5 R/W 6 పొక్సో ఆక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఆధునికత పేరుతో, హైదరాబాద్‌లోని పబ్‌లు భయంకరమైన డ్రగ్ డెన్స్‌గా, అసభ్యత & వికృత సంస్కృతిని పెంచి, యువకుల కెరీర్‌ను నాశనం చేస్తున్నాయి.
— Prof Dasoju Srravan (@sravandasoju) June 5, 2022
మన యువత భవిష్యత్తును మరియు సంస్కృతిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా పబ్‌లు, హుక్కా సెంటర్లు, బెల్ట్ షాపులను నిషేధించాలి.. pic.twitter.com/pIPQQs6cQz
డ్రగ్, పబ్ కల్చర్ కి పరాకాష్టగా హైదరాబాద్
డ్రగ్, పబ్ కల్చర్ కి పరాకాష్టగా మారిన హైదరాబాద్‌లో ఇటీవల ఒక పబ్ నుండి టీఆర్ఆర్, ఎంఐఎం పార్టీ చెందిన పెద్దల పిల్లలు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన అరాచక చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖడించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందుతులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.