Dasoju Sravan on Jubilee Hills Case: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో కుట్ర జరుగుతోంది, వివరాలు చెప్పకపోవడంపై అనుమానాలు: దాసోజు శ్రవణ్
జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా న్యాయం కోరిన నేతల్ని అరెస్ట్ చేయడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను గుర్తించగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అయితే నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా దాసోజు శ్రవణ్ ఆరోపించారు. డ్రగ్, పబ్ కల్చర్ కి పరాకాష్టగా మారిన హైదరాబాద్ లో తాజాగా ఒక పబ్ నుండి టీఆర్ఆర్, ఎంఐఎం పార్టీ చెందిన పెద్దల పిల్లలు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన అరాచక చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖడించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందుతులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఉక్కుపాదం మోపాలంటే ప్రభుత్వం పట్టించుకోలేదు
డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపాలని గతంలో ఎన్ని సార్లు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు కోరినా టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోలేదని దాసోసు శ్రవణ్ ఆరోపించారు. ఇప్పుడు అధికార పార్టీ చెందిన వారి పిల్లలే ఇలాంటి దాస్టికానికి పాల్పడటం దుర్మార్గం అన్నారు. మే 28 తేదిన అత్యాచారం జరిగినట్లు ఎఫ్ ఐఆర్ లో వుంది, అయితే మే 31 తేదిన తండ్రి ఫిర్యాదు చేసినట్లుగా ఉంది. జూన్ 3 తేదీ వచ్చినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోలీసులు ఏం చేస్తున్నారు ? ఎవరిని విచారించారు.. నిందుతులు ఎవరు ? అనే అంశాలు ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
Condemn the illegal arrest of @INCTelangana Leaders Smt @RenukaCCongress @AnilTpyc @ShivaSenaIYC and others. Instead of arresting the rape culprits, Telangana Police detaining the Congress Leaders is a clear indication of their conspiracy & collusion with ruling TRS/ MIM party
— Prof Dasoju Srravan (@sravandasoju) June 3, 2022
సీసీటీవీ ఫుటేజీలో అంతా కనిపిస్తోంది
మైనర్ బాలికను కొందరు తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ పుటేజ్ లో కనిపిస్తున్నాయి. పబ్‌లో కూడా ఫుటేజ్ వుంటుంది. దాని ప్రకారం నిందుతులను ఎవరైనా పట్టుకోవచ్చు అన్నారు. ఎఫ్ఐర్‌లో కారు నెంబర్ ఇచ్చారు కానీ వెహికల్ ఓనర్ పేరు ఇవ్వకపోవడంలోనే ప్రభుత్వ కుట్ర కనిపిస్తుందని ఆరోపించారు. కారు నెంబర్ వుంటే ఓనర్ పేరు తెలుసుకోవడం చాలా సులువు అని, ఆన్ లైన్ లో నెంబర్ కొడితే పేరు వస్తుందన్నారు. అయితే కారు ఓనర్ పేరు చెప్పడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు ? ఎవరిని కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నారని దాసోసు శ్రవణ్ ప్రశ్నించారు. ఇలా అయితే మహిళలకి పోలీసులు, ప్రభుత్వం ఎలా రక్షణ కలిపిస్తుందో చెప్పాలన్నారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. ఆడపిల్లలకు రక్షణ కలిపించే విధంగా వెంటనే నిందితులకు కఠిన శిక్షలు వేయాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.