అన్వేషించండి

Diwali Politics : బాణసంచా కాల్చడంపై ఆంక్షలు - బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు

Diwali 2023: దీపావళి క్రాకర్స్ పేల్చడంపై పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులపై రాజకీయం ప్రారంభమయింది. బీజేపీ విమర్శలకు బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.

Telangana News:  ఎన్నికల సమయంలో  అన్నీ వివాదాస్పద అంశాలే. రాజకీయ పార్టీలు ( Political Parties )  అనుకోవాలే కానీ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టరు. తెలంగాణలనూ అంతే. దీపావళి పండుగకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఆ ఉత్తర్వులు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారని బీజేపీ మండిపడే.. బీఆర్ఎస్ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 

బహిరంగ ప్రదేశాల్లో టసాసులు కాల్చడంపై నిషేధం

బహిరంగ ప్రదేశాల్లో టపాసులు ( Crackers ) కాల్చడాన్ని నిషేధిస్తూ రాచకొండ పోలీసులు ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు.  ఈ ఆంక్షలు నవంబర్ 12 నుంచి 15 వరకు అమలులో ఉంటాయన్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చడానికి అవకాశం ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు నిబంధనలు, నిర్ణయించిన శబ్ధ కాలుష్యం పరిమితులకు లోబడి పటాకులు కాల్చి దీపావళిని జరుపుకోవాలని పోలీసులు ప్రకటించారు.  హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ధ్వనిని విడుదల చేసే పటాకులు పేల్చడంపై పూర్తి నిషేధం ఉంది.  ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు  జారీ చేసిన ఆదేశాల మేరకు నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

బీఆర్ఎస్‌పై బీజేపీ విమర్శలు 

ఈ ఉత్తర్వులను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీజేపీ .. హిందూ పండుగలకు ఆంక్షలు పెడుతున్నారని విమర్శలు గుప్పించింది. అధికారంలో  కాగం్రెస్ ఉన్నా.. బీఆర్ఎస్ ఉన్నా ఇంతే ఉంటుందని మండిపడ్డారు. 

 

గట్టిగా కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ 

బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి  గట్టి కౌంటర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆదేశాలు ఇచ్చారని..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు  చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను బీఆర్ఎస్ పోస్టు చేసింది.  ప్రతీ దానికి రాజకీయం చేయడం మతం రంగు పులమడం కరెక్ట్ కాదని సూచించింది. ఇలాంటి చీప్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు హర్షించరని .. విద్వేష రాజకీయాలపై వారెప్పుడూ అప్రమత్తంగా ఉంటారని బీఆర్ఎస్ తెలిపింది. 

 

 
ఇవీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు  

పండుగల సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. దీనిపై కొత్తగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని తెలిపింది. బాణసంచాలో బేరియం సహా.. నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని తెలిపింది.  2018లో ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని స్పష్టం చేసింది. వాటిని కూడా దీపావళి వంటి పర్వదినాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే కాల్చుకోవచ్చని తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget