YS Sharmila : దమ్ముంటే అసెంబ్లీకి పిలవండి, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్
YS Sharmila : దమ్ముంటే అసెంబ్లీకి పిలవండి, పాదయాత్రగా వస్తా అంటూ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.
YS Sharmila : తనను చంపాలని చూస్తున్నారని ఆరోపణలు చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎమ్మెల్యేలందరు తనపై ఫిర్యాదు చేశారని, తనను అసెంబ్లీకి పిలిచి వివరణ కోరతామని స్పీకర్ అన్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రమ్మంటే వస్తాని, డేట్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ముందు కూర్చొని ధర్నా చేస్తానన్నారు. తనను అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. వైఎస్ షర్మిల తెలంగాణ సర్కారు తీరుపై, మంత్రులపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోనున్నారన్న వార్తలపై తీవ్రంగా మండిపడ్డారు.
షాద్ నగర్ టౌన్ బహిరంగ సభ🔥 pic.twitter.com/sqtMb3mndr
— 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) September 19, 2022
పాదయాత్ర ఎలా ఆపుతారో చూస్తా?
షాద్ నగర్ లో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల పాలమూరు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. బాధ్యత గల మంత్రి మహిళను పట్టుకుని మరదలు అవమానకరంగా మాట్లాడినా కేసులు పెట్టరన్నారు. తానే స్వయంగా వెళ్లి కేసు పెట్టినా, మంత్రిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులకు తనకు జరిగిన అవమానం కనిపించటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రశ్నిస్తే తనపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పాలమూరు ఎమ్మెల్యేలందరూ కట్టగట్టుకుని వెళ్లి అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారన్నారు. ప్రజల్లో వస్తున్న మద్దతు చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే తన పాదయాత్రను ఆపాలని వైఎస్ షర్మిల సవాల్ చేశారు. ఎలా ఆపుతారో చూస్తానన్నారు. ఒక మంత్రి మరదలు అని తనను అవమానిస్తే ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు తనను ఎలా అరెస్టు చేస్తారో చూస్తానన్నారు.
దమ్ముంటే పిలవండి
"ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు అంతా వెళ్లి స్పీకర్ కు నా మీద ఫిర్యాదు చేశారు. ఆయన నిజమే యాక్షన్ తీసుకోవాలని సానుకూలంగా స్పందించారట. ఇక నాపై కేసులు పెట్టి, అరెస్టు చేస్తారట. అసెంబ్లీకి రమ్మని వివరణ కోరతారట. మీకు దమ్ముంటే నన్ను అసెంబ్లీకి రమ్మనండి. పాదయాత్రగా అసెంబ్లీకి వస్తా, ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీరు డేట్ ఇస్తారా? నన్నే డేట్ తీసుకుని రమ్మంటారా? అసెంబ్లీ ముందుకు వచ్చి మాట్లాడతాను. నేను ఏం తప్పుమాట్లాడానో ప్రశ్నిస్తాను. ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎవరికి భయపడదు. పరాయి స్త్రీలో ఒక తల్లినో , చెల్లినో, బిడ్డనో చూడాల్సిన మంత్రి సంస్కారహీనంగా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తిని ఏమని పిలవాలి. మంగళవారం మరదలు అని నీచంగా మాట్లాడారు. నేను దానిపై మాట్లాడితే తప్పంట. నా మీద మంత్రి కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేను ఒక మహిళగా మంత్రిపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు నా మీద కేసుకు పెడుతున్నారు. "- వైఎస్ షర్మిల
Also Read : KTR Tabs : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్ విద్యార్థులకు స్మైల్ గిఫ్ట్ - కేటీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదిగో !
Also Read : Sharmila Politics : షర్మిలపై నిజంగానే కుట్ర జరుగుతోందా ? పొలిటికల్ అటెన్షన్ కోసం "స్ట్రాటిజిక్" ఆరోపణలా ?