By: ABP Desam | Updated at : 20 Apr 2023 08:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Minister Errabelli : ఇప్పుడు దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదు...అది ఫెయిల్ అయింది. తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తం కావాలి. అతి తక్కువ కాలంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుందటమే ఇందుకు నిదర్శనం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సీతారపురం, చిప్పరాళ్ల బండ తండా, పొట్టిగుట్ట తండా, ధర్మగడ్డ తండా, సీత్యతండా, లకావత్ తండా, లక్ష్మణ్ తండా, పడమటి తండా [డి] కలిపి ధర్మపురం గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... 'రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరుగులేదు. తెలంగాణలో ప్రతిపక్షాలకు జనాదరణ లేదు. బీఆర్ఎస్ గెలుపునకు ఎదురు లేదు. ఇక ఇప్పుడు కావాల్సింది దేశానికి సీఎం కేసీఆర్ మార్గదర్శనం. దేశం మొత్తం కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నది. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలి. కేంద్రంలో, రాష్ట్రంలో మన పాలనే ఉండాలి. అప్పుడే రాష్ట్రం, దేశం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది' అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపుల్ల
'అభివృద్ధి నిరోధకులకు అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలి' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపు నిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేలా ప్రజలను సమాయత్తం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. మరోవైపు తెలంగాణ పట్ల కేంద్ర వైఖరిని మంత్రి దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా, అడ్డుపుల్ల వేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని మంత్రి వివరించారు.
దేశానికే ఆదర్శంగా
ఇక తాను పాలకుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంతున్ననాని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని..సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాలలో రాష్ట్రం దేశంలోనే నెం.1 గా నిలిచిందని ప్రశంసించారు. పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేవాలయాల, చారిత్రక ప్రదేశాల, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన వివరాలను మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో చెరువుల బాగు, మిషన్ భగీరథ మంచి నీరు, రిజర్వాయర్లు, చెరువులను నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
మహిళలకు వడ్డిస్తూ, వారితో కలిసి ఆత్మీయ భోజనాలు
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ నేతలు, కార్యకర్తలకు స్వయంగా వడ్డించారు. మహిళలతో కలిసి భోజనాలు చేశారు.
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
Vemula Prashanth Reddy: తెలంగాణ దశాబ్ది సంబరాల నిర్వహణపై మంత్రి రివ్యూ, ప్రణాళిక ఇదీ
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!