అన్వేషించండి
Advertisement
Morning Headlines: మతమేదో చెప్పిన జగన్, తెలంగాణలో విద్యార్థుల కోసం కొత్త పథకం వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News Today :
1. జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్నలు
చట్టాన్ని కాపాడే సీఎం హోదాలో ఉండి కూడా అప్పట్లో జగన్ దానిని ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు అన్నారు. హిందువులు కాని వారు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని గుర్తు చేశారు. సీఎం హోదాలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు. దళితులను ఆలయాల్లోకి రానివ్వడం లేదని నీకు ఎవరు చెప్పారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. జగన్ తిరుమల పర్యటన రద్దు
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దైంది. రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా లడ్డూ వ్యవహారంపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జగన్ తిరుమలలో పర్యటించనున్నట్టు ప్రకటించారు. అయితే, అనూహ్యంగా జగన్ పర్యటన రద్దైంది. లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని... తిరుమల లడ్డూపై చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. నా మతం అదే.. డిక్లరేషన్‌లో రాసుకోండి: జగన్
ముఖ్యమంత్రిగా ఐదేళ్లు శ్రీవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టువస్త్రాలు సమర్పించానని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘ఈరోజు నా మతం గురించి కొందరు అడుగుతున్నారు? నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకొంటారేమో.. రాసుకోండి. చంద్రబాబు తన 100 రోజుల పాలన వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అంటూ రాజకీయం చేస్తున్నారు‘ అంటూ జగన్ విమర్శించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. తెలంగాణలో విద్యార్థుల కోసం కొత్త పథకం
సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించేందుకు "తెలంగాణ దర్శిని" అనే కొత్త కార్యక్రమం తీసుకొస్తున్న తెలిపారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. వైజాగ్ స్టీల్ ప్లాంట్.. సెయిల్‌లో విలీనం..?
నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కేంద్రం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను విక్రయించాలని కేంద్రం గతంలోనే చూసింది. దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. మిగతా స్టీల్ ప్లాంట్స్ మాదిరిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు స్వంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని తెలుస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. గురువారం రాత్రి ఆయన్ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. గనుల కేటాయింపులలో పలు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆయను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు వెంకటరెడ్డికి రిమాండ్ విధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. ఏపీలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే.. ?
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టిసారించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. పోలీసులను ఆశ్రయించిన మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పోలీసులను ఆశ్రయించారు. ప్రైవైట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తన కొడుకుపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు. శ్యామ్ బస్ అనే సీనియర్.. తన కొడుకు వైష్ణవ్‌ను ర్యాగింగ్ చేశాడని, ఆ సమయంలో జరిగిన గొడవలో చెవి కొరికేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్పీ పట్నాయక్ చేసిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. పొంగులేటి ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం.. ?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడినట్లుగా తెలుస్తోంది. వాటిని లెక్క పెట్టడానికి రెండు కౌంటింగ్ మెషిన్లను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. మొదట ఓ మెషిన్ ను తీసుకెళ్లారు..సరిపోవడం లేదని రెండో మెషీన్‌నూ తీసుకెళ్లారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు పట్టుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. పొంగులేటి, ఆయన కుటుంబానికి చెందిన మొత్తం పదిహేను చోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ గ్రూపును నడుపుతున్న పొంగులేటి ముందస్తు పన్ను చెల్లింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. నేడు తెలంగాణకు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రైమ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement