Jagan Tirumala Tour Cancel : తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ - వివాదాస్పదం కాకూడదనేనా ?
Tirumala News : తిరుమల పర్యటనను జగన్ అనూహ్యంగా క్యాన్సిల్ చేసుకున్నారు. దాడులు చేసేందుకు కుట్ర పన్నారని వైసీపీ నేతలు వరుసగా ఆరోపించిన కొద్ది సేపటికే ఈ నిర్ణయం ప్రకటించారు.
Jagan unexpectedly canceled his visit to Tirumala : వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను వైసీపీ చేసింది. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా.. డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ ఇస్తేనే స్వామి వారి దర్శనానికి అనుమతి ఇ్తామని టీటీడీ అధికారులు తేల్చేశారు. అదే సమయంలో ఈ అంశం సున్నితమైనదిగా మారింది. దాడులు చేస్తారంటూ వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించారు. అలా భయం వ్యక్తం చేసిన కాసేపటికే జగన్ తిరుమల పర్యటన రద్దు అయినట్లుగా ప్రకటించారు.
జగన్ ఎప్పుడు తిరుమలకూ వెళ్లినా హాట్ టాపిక్ గా డిక్లరేషన్ అంశం
సీఎం హోదాలో ఉన్నా జగన్ తిరుమలకు వెళ్లినప్పుడల్లా డిక్లరేషన్ అంశం హైలెట్ అవుతూనే ఉంది. ఆయన అన్య మతస్తుడని.. దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్లు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయితే సీఎం హోదాలో ఉన్న జగన్ ను డిక్లరేషన్ అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. ఎమ్మెల్యే మాత్రమే . అందుకే ఆయనకు మామూలు ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. గత అనుభవాల కారణం ఇప్పుడు టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడగం ఖాయం కావడంతో జగన్ దర్శనానికి వెళ్లకపోవడమే మంచిదని అనుకున్నట్లుగా చెబుతున్నారు.
హిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత
జగన్ పర్యటనను అడ్డుకోకూడదని కూటమి పార్టీల నిర్ణయం
వైసీపీ బలప్రదర్శన చేస్తే దానికి తగ్గట్లుగా బదులివ్వడానికి కూటమి నేతలు కూడా రెడీ అయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే తిరుపతిలోని వైసీపీ క్యాడర్, లీడర్లు చాలా మందికి పోలీసులు ముందస్తుగానే నోటీసులు జారీ చేశారు. పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చారు. దీంతో వైసీపీ నేతలు గుమికూడే పరిస్థితి ఉండదు. తిరుమలలోనూ జగన్ అతి కొద్ది మందితోనే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్లు ఉన్న వారినే కొండపైకి అనుమతిస్తారు. చాలా హిందూ సంస్థలకు చెందిన వారు ఇప్పటికే తిరుమల, తిరుపతి చేరుకున్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురు కాకుండా ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడమే మంచిదన్న నిర్ణయానికివచ్చినట్లుగా చెబుతున్నారు.
టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! అందుకే రియాక్ట్ కావడం లేదా?
దాడులు జరుగుతాయన్న భయంతోనే పర్యటన రద్దు ?
జగన్ తిరుమల పర్యటన విషయంలో రాజకీయంగా అనేక స్టేట్ మెంట్లు వచ్చాయి. అలాగే హిందూ సంస్థల నుంచి కూడా అదే తరహా ప్రకటనలు వచ్చాయి. ఇలాంటి అలజడిలో ఏం జరిగినా వైసీపీకే మైనస్ అవుతుది కాబట్టి వీలైనంతగా డౌన్ ప్లే చేస్తే బెటరన్న ఉద్దేశంతో వైసీప వ్యూహకర్తలు ప్లాన్ మార్చినట్లుగా తెలుస్తోంది. ఉద్రిక్తతలు తగ్గిపోయిన తరవాత జగన్ తిరుమల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.