అన్వేషించండి

CM Chandrababu: 'దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని ఎవరు చెప్పారు' - వైఎస్ జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Andhra News: తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా ఆచారాలు, సంప్రదాయాలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తనను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకున్నారన్న జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

CM Chandrababu Anger On Ys Jagan Comments In Tirumala Declaration Issue: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను (Jagan) తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని.. ర్యాలీలు, జనసమీకరణలు చెయ్యొద్దని మాత్రమే చెప్పామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకున్నారన్న జగన్ వ్యాఖ్యలపై సీఎం కౌంటర్ ఇచ్చారు. తిరుమల అంశంపై జగన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 'రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు మీకు ఉన్నాయా.? తిరుమలకు వెళ్తే ఆలయ సంప్రదాయాలు పాటించాల్సిందే. అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు. దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని మీకు ఎవరు చెప్పారు.?. సీఎంగా ఉన్నప్పుడే చట్టాలను ఉల్లంఘించానని ఎలా చెబుతారు.?. స్వామి వారిని రాజకీయాలు, వ్యాపారాలకు వాడుకోవడం మీరు చేసిన తప్పు. టీటీడీ అధికారుల నియామక విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కల్తీ ఘటనలో తప్పు చేసిన వారందరిపై చర్యలు ఉంటాయి.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

'నియమాలు పాటించాల్సిందే'

తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే ఎవరైనా ఆచారాలు, నియమాలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర మతాలను గౌరవించాలని.. సొంత మతాన్ని ఆచరించాలని అన్నారు. 'ఇటీవల తిరుమలలో జరిగిన పరిణామాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుపతిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఏ మతానికైనా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఇంతకుముందు జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారు. చాలామంది డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారు. బైబిల్ 4 గోడల మధ్యే ఎందుకు చదవాలి.?. చర్చికి వెళ్లి కూడా చదవొచ్చు. జగన్ చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అడల్టరేషన్ పరీక్షకు గతంలో మీరు ఎందుకు పంపలేదు.?. టెండర్లు పిలిచేందుకు నిబంధనలు ఎందుకు మార్చారు.? నాసిరకం పదార్థాలతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. రామతీర్థం, అంతర్వేది ఘటనలపై ఇంతవరకూ విచారణ జరగలేదు. తిరుమలలో తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తే సంప్రోక్షణ చేస్తారు. ఈ నెల 23న శాంతియాగం చేశారు. వేంకటేశుని సన్నిధిలో అపవిత్రం కాకుండా చూస్తాం.' అని సీఎం తెలిపారు.

Also Read: YS Jagan: 'రాష్ట్రంలో రాక్షస రాజ్యం' - తిరుమల లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ టాపిక్ తెచ్చారన్న జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Embed widget