అన్వేషించండి

YS Jagan: 'రాష్ట్రంలో రాక్షస రాజ్యం' - తిరుమల లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ టాపిక్ తెచ్చారన్న జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

YS Jagan: దేవుని దగ్గరకు వెళ్తే కూడా అడ్డుకునే మనస్తత్వం తన రాజకీయ జీవితంలో చూడలేదని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే డిక్లరేషన్ అంశాన్నితెరపైకి తెచ్చారన్నారు.

YS Jagan Sensational Comments In Tirumala: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) మండిపడ్డారు. తిరుమల పర్యటన రద్దు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుని దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. దేవుడి దర్శనానికి వెళ్తామంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తున్న పరిస్థితులు ఎప్పుడూ దేశంలో జరిగి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, శ్రేణులకు నోటీసులు ఇవ్వడం దారుణమని అన్నారు. 'జగన్ మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆద్వర్యంలో కార్యకర్తలతో మీ సొంత వాహనాల్లో బయల్దేరి తిరుపతి చేరుకొని వాళ్లు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనడం చట్టవ్యతిరేక చర్యగా ఇస్తున్న నోటీసు ఇచ్చారు.' అని నోటీస్‌ను చదివి వినిపించారు.

'టాపిక్ డైవర్ట్ చేసేందుకే..'

టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలని ఒక్కొక్కటిగా రుజువు అవుతుందనిపిస్తోంది. అందుకే వంద రోజుల పాలన మీద డైవర్షన్ కోసం లడ్డూల టాపిక్ తీసుకొచ్చారు. ఆ లడ్డూ విషయంలో అడ్డగోలుగా దొరికిపోయే సరికి ఈ టాపిక్ డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చారు. తిరుమల పవిత్రత, స్వామి ప్రసాద విశిష్టతను టీటీడీ పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్దితో జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారీ అయినట్టుగా చెబుతున్నారు. ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా.. నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడుతూ అపవిత్రం చేసేలా చేస్తుంటే ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా..?. ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా.?' అని జగన్ నిలదీశారు.

'18 సార్లు రిజెక్ట్ చేశాం'

తిరుపతిలో ప్రతి ఆరు నెలల కోసారి టెండర్లు పిలుస్తారని.. ఎవరైనా పాల్గొనవచ్చని జగన్ అన్నారు. 'తక్కువకు ఎవరు కోట్ చేస్తే వాళ్లకు టెండర్ అప్రూవ్ చేస్తారు. ఇది రొటీన్ ప్రక్రియ. ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ప్రసిద్ధి చెందిన టీటీడీ బోర్డులో కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా విశిష్ట వ్యక్తులను రికమండ్ చేస్తారు. అలాంటి కూర్పుతో కూడిన బోర్డు టీటీడీ బోర్డు. అక్కడ ఉన్న వారు తప్పు చేయాలన్నా చేయలేని విధంగా వ్యవస్థ ఉంటుంది. పారదర్శకతతో దేవుడికి ఇంకా ఎలా మంచి చేయాలో అన్న ఆలోచనతో పని చేస్తుంటారు. ఇక్కడ టెండర్ల ప్రక్రియలో అదే జరిగింది. ఆ టెండర్లో వచ్చిన వారికి ఒకరికే ఇచ్చే పరిస్థితి లేదు. ఇలానే సప్లై చేసే వాళ్లు సప్లై చేస్తుంటారు. సప్లై చేసే వాళ్లు ల్యాబ్స్‌ నుంచి క్వాలిటీ చెక్ చేయించుకొని ట్యాంకర్లలో ఉన్న పదార్థాలు క్వాలిటీ నిర్దారిస్తూ సర్టిఫికేట్స్‌తో వస్తారు. తిరుమల వచ్చిన తర్వాత కూడా మూడు టెస్టులు చేస్తారు. ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా ముందుకు వెళ్తుంది. ఆ మూడు టెస్టుల్లో ఏ టెస్టు ఫెయిల్ అయినా వాహనాన్ని వెనక్కి పంపేస్తారు. చంద్రబాబు టైంలో 2014- 19 మధ్య 14 నుంతి 15 సార్లు  ట్యాంకర్లను వెనక్కి పంపించారు. 2019-24 18సార్లు రిజెక్ట్ చేశాం.' అని జగన్ స్పష్టం చేశారు.

Also Read: Declaration Boards : అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే - తిరుపతిలో పలు చోట్ల బోర్డుల దృశ్యాలు వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget