అన్వేషించండి

Morning Top News: జగన్‌కు జోగి రమేష్ షాక్, జాకీర్‌ హుస్సేన్ కన్నుమూత వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: కాకినాడ జిల్లాలో మూడు ప్రాణాలు తీసిన ఘర్షణ, మంచు ఫ్యామిలీలో మరో పంచాయితీ వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Morning Top News:

 తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్

తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

కాకినాడ జిల్లాలో మూడు ప్రాణాలు తీసిన వివాదం

కాకినాడ జిల్లా సామర్ల కోట మండలంలోని వేట్లపాలెంలో రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నిర్మాణం విషయంలోతలెత్తిన వివాదం ఇప్పుడు హత్యల వరకు వెళ్లింది. ఆదివారం రాత్రి జరిగిన గొడవలో ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ తగాదాలో ప్రకాశ్‌రావు అనే వ్యక్తి తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన  మరో ఇద్దరు చికిత్స పొందుతూ  మృతి చెందారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

వదంతులు నమ్మొద్దు -  బండి సంజయ్

బీజేపీ తెలంగాణ అధ్యక్ష రేసులో తాను ఉన్నానని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. వదంతులు నమ్మవద్దని పార్టీ నేతలకు సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధిష్టానం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలను అప్పగించిందని, ప్రస్తుతం ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి

తెలంగాణలో గ్రూప్స్ పరీక్షలలో కాపీయింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ లో కాపీ కొడుతూ అభ్యర్థులు దొరకగా, తాజాగా సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 అభ్యర్థి దొరికారు.  వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ శ్రీ సాయి డెంటల్ కళాశాలలో గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  వెంటనే అప్రమత్తమైన ఇన్విజిలేటర్ ఆ అభ్యర్థి పేపర్ లాగేసుకున్నారు. అభ్యర్థిని ఎగ్జామ్ రాయనివ్వకుండా పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, అల్లు అర్జున్‌ పోస్టు వైరల్

 సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళా అభిమాని రేవతి కుటుంబాన్ని తాను కలవలేకపోతున్నానని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కుటుంబాన్ని నేరుగా కలిసి వారికి అండగా నిలవలేకపోతున్నానని తెలిపారు. కానీ వారికి అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు.హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మంచు ఫ్యామిలీలో మరో పంచాయితీ

మంచు ఫ్యామిలీ పంచదార వివాదం రాజుకుంది. వారం రోజుల క్రితం మొదలైన ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో చల్లబడినట్టే కనిపించినా ఇదంతా కల్పన అని తేలింది. తన ఫ్యామిలీని వేధిస్తున్నారని మరోసారి పోలీసులను ఆశ్రయించారు మంచు మనోజ్. తన సోదరుడు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ్‌తో కలిసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా ఇంటిలోకి చొరబడి  జనరేటర్‌లో పంచదార వేశారని అన్నారు. దీని కారణంగా రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆరోపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

జగన్కు జోగి రమేష్ షాక్ ఇవ్వనున్నారా

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడులో చాలా ఆసక్తికర సంఘటన జరిగింది. వైసిపి కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా టిడిపి నేతలతోపాటు వైసిపి నేత హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చ మొదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్

బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో సీరియల్ హీరో నిఖిల్ విన్నర్‌గా నిలిచాడు. టాస్క్‌ల్లో పట్టుదల కనపరచి, హౌస్‌లో కామ్‌నెస్ కోల్పోకుండా మంచి గేమ్ ఆడిన నిఖిల్ బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచాడని చెప్పవచ్చు. మొదట్లోనే వరుసగా మూడు సార్లు  హౌస్ చీఫ్‌గా ఉన్నాడు. ఆ సమయంలోనే హౌస్‌ని బాగా కంట్రోల్‌లో ఉంచడం నిఖిల్‌కు బాగా ప్లస్ అయింది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వెళ్లిన గౌతమ్ రన్నరప్‌ స్థానం సంపాదించాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం

తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూశారు.  రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాకీర్‌ హుస్సేన్‌ ఇవాళ కన్నుమూశారు. ఈమేరకు కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాకీర్‌ హుస్సేన్‌ మూడు సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం నేర్చుకున్నారు. ఏడేళ్ల వయసులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌

బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు కుప్పకూలింది.  ఏడు వికెట్ల నష్టానికి 405 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 40 మాత్రమే జోడించి అలౌట్ అయింది. మూడో రోజు భారత్‌ తరఫున జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌ ఒక్కో వికెట్‌ తీశారు.భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Viral News: రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Embed widget