అన్వేషించండి

Kamareddy Politics: ఓ కుట్రతో సీఎం కామారెడ్డికి వస్తున్నడు, ఈ బరితెగించిన వ్యక్తిని భూమ్మీదే చూడలే - రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

Kamareddy Politics: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం, బీసీ డిక్లరేషన్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు.

Revanth Reddy Comments on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ పేరుతో ఓ కుట్రతో కామారెడ్డికి వస్తున్నడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఆరోజు మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు దీక్ష చేస్తే రాలేదని.. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నడని విమర్శించారు. కేసీఆర్ (KCR) తనను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని అడుగుతూ సిగ్గుతప్పిపోయాడని విమర్శించారు. ఇంత బరితెగించిన వ్యక్తిని భూమ్మీదనే చూడలేదని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి (Revath Reddy) నామినేషన్ వేసిన అనంతరం, బీసీ డిక్లరేషన్ (BC Declaration) పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సుదీర్ఘంగా మాట్లాడారు.

‘‘కేసీఆర్ మీద గంపగోవర్థన్ కూడా ఫీల్ అవుతున్నడు. నా సీటే కావాల్సొచ్చిందా? అని తిట్టుకుంటున్నడు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే లక్ష కోట్లు దోచుకున్నవు. హైదరాబాద్ లో వేల ఎకరాలు, జన్వాడ ఫాంహౌస్ లాంటివి ఎన్నో కట్టుకున్నరు.

కామారెడ్డి రైతులు చనిపోయినా పట్టించుకోలేదు

2015లో తనను కేసీఆర్ జైలుకు పంపిన సమయంలో లింబయ్య అనే కామారెడ్డి రైతు దిక్కుతోచక హైదరాబాద్‌లో వాచ్ మేన్ గా జాయిన్ అయ్యాడు. ప్రభుత్వంలో ఎవరిని కలవాలని ప్రయత్నించినా ఆయనకు సాధ్యం కాలేదు. దిక్కుతోచక సచివాలయం ఎదుట ఉరి వేసుకొని లింబయ్య ప్రాణాలు వదిలాడు. వ్యవసాయ సమస్యలతో ఆయన చనిపోతే, కుటుంబ తగాదాల వల్ల చనిపోయాడని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. 

నువ్వు నిజంగా కోనాపూర్‌లో నీ కన్న తల్లి పుట్టి ఉంటే, నువ్వు ఆ తల్లికే పుట్టి ఉంటే ఈ కామారెడ్డి రైతులు చనిపోయినప్పుడు ఎందుకు వారిని ఆదుకోలేదు. పదేళ్ల తర్వాత ఓట్ల కోసం కామారెడ్డి గుర్తుకొచ్చిందా? గజ్వేల్‌లో ఈ పదేళ్లపాటు ఏం చేసినవ్. గజ్వేల్ ను బంగారు తునక లాగా చేసి ఉంటే అక్కడి నుంచి పారిపోయి కామారెడ్డికి ఎందుకు వస్తవ్ సన్నాసి. మీరు ఆలోచించండి. 

గజ్వేల్ లో వేల ఎకరాలు ఆక్రమించుకున్నడు. ఇప్పుడు కామారెడ్డి మీద పడ్డడు. మాస్టర్ ప్లాన్ పేరుతో ఓ కుట్రతో ఇక్కడికి వస్తున్నడు. ఆరోజు దీక్ష చేస్తే రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నడు. గంపగోవర్థన్ కూడా ఫీల్ అవుతున్నడు. నా సీటే కావాల్సొచ్చిందా? అని తిట్టుకుంటున్నడు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే లక్ష కోట్లు దోచుకున్నవు. హైదరాబాద్ లో వేల ఎకరాలు, జన్వాడ ఫాంహౌస్ లాంటివి ఎన్నో కట్టుకున్నరు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు. ఆ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయావు. గ్రూప్స్ క్వశ్చన్స్ పత్రాలు జిరాక్స్ సెంటర్స్‌లో కనిపించాయి. సన్నాసి నీకు 10 ఏళ్లు ఇస్తే నీ యవ్వారం ఇట్ల ఏడ్చింది’’ అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

నేను సీబీఐ విచారణకు రెడీ, నువ్వు రెడీనా - రేవంత్ రెడ్డి

‘‘కామారెడ్డి గడ్డమీద నుంచి తెలంగాణ భవిష్యత్ ను మీరు నిర్ణయించబోతున్నారు. యావత్ రాష్ట్రమంతా కామారెడ్డి తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు కామారెడ్డి సిద్ధమైంది. గజ్వేల్ రైతుల ప్రాణాలతో చేలాగాటమాడిన నువ్వు.. కామారెడ్డి రైతులను ఆదుకుంటావా? మాస్టర్ ప్లాన్ పేరుతో కేసీఆర్ ఒక కుట్ర తో కామారెడ్డికి వచ్చిండు. రైతులు తిరగబడటంతో కొడుకును పంపి మాస్టర్ ప్లాన్ రద్దు చేసిండు. రద్దయింది మాస్టర్ ప్లాన్ కాదు.. మీ ప్రభుత్వమే రద్దయింది.

ఒక బీసీ బిడ్డ గంపగోవర్ధన్ సీటు కేసీఆర్ గుంజుకున్నాడు. దోచుకున్నది చాలక మళ్లీ మూడోసారి సీఎం ను చేయాలని అడుగుతుండు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను బండకేసి కొట్టుడు ఖాయం. ఎమ్మెల్యేను కొనడానికి పోయిన రేవంత్ ను మీరు ఎమ్మెల్యే చేయొద్దు అని కేసీఆర్ అంటుండు. 40 ఎమ్మెల్యేలను 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను, సర్పంచ్ లను కొన్నది కేసీఆర్. గంపగోవర్ధన్ ఏ పార్టీ వాడు... ఆయన్ను టీడీపీ నుంచి నువ్వు కొనలేదా? రాష్ట్రాన్ని అమ్మకాలు, కొనుగోలు కేంద్రంగా మార్చిందే కేసీఆర్.

కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా?బూచోడు వచ్చి మీ భూములు గుంజుకుంటాడు.. మీకు కనబడడు, మీకు వినబడడు. కామారెడ్డి ప్రజలకు న్యాయం జరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget