అన్వేషించండి

తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

నైరుతి రుతుపవనాలు బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ అలర్ట్ జారీ చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్, అర్బన్ ఫ్లడింగ్ ముప్పు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేలా కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోవడంతో రాబోయే వారం రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. 

నైరుతికి జత కలిసిన ద్రోణి

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రధానంగా రెండు బలమైన వాతావరణ వ్యవస్థలు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోస్తా ఆంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా బలమైన ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వేగంగా భూభాగం వైపు వీస్తున్నాయి. 

రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు 

ఈ రెండు వ్యవస్థ కలయిక వల్ల మేఘాలు దట్టగా అలుముకొని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు దారితీస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. 

ఐదు రోజులు జోరువానలు

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఈ వర్షాల తీవ్రత ఈ నెలాఖరు వరకు మాత్రమే కాకుండా, జులై 2వ తేదీ వరకు కొనసాగే  అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో అత్యంత కీలకం.  రాబోయే 48 గంటలు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 27 నుంచి జులై 2వరకు తెలంగాణ వ్యాప్తంగా నిరంతరాయంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. 

తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌

తెలంగాణలోని జిల్లాలను వాతావరణ శాఖ రెండు వర్గాలుగా విభజించి హెచ్చరికలుజారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, జగిత్యాల, కరీంనగర్, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

ఏపీలో అప్రమత్తంగా ఉండాల్సిన జిల్లాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కోస్తా జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. 

ఈ ఏడాది రుతుపవనాలు ఆరంభంలో కాస్త నెమ్మదించినప్పటికీ జూన్ చివరి వారంలో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఇది వ్యవసాయ పనులకు మేలు చేసే అంశమే అయినప్పటికీ ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫ్లడింగ్‌ ముప్పు పొంచి ఉందని. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. 

Frequently Asked Questions

ఈ భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు?

ఈ వర్షాలు వ్యవసాయానికి మేలు చేసినా, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫ్లడింగ్ ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget