అన్వేషించండి

Riyaz Encounter Nizamabad: నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను హత్య చేసిన రియాజ్‌ హతం- పారిపోతున్న టైంలో ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

Riyaz Encounter Nizamabad:  నిజామాబాద్‌ జిల్లాలో పోలీసులకు చిక్కిన రియాజ్‌ మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు కాల్పులు జరిపారు. 

Riyaz Encounter Nizamabad:  నిజామాబాద్‌ జిల్లాలో రియాజ్‌ కేస్ క్లోజ్ అయ్యింది. కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన కేసులో ఆదివారం అరెస్టు అయిన రియజ్, ఇవాళ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆదివారం రియాజ్‌ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరుగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. 

రెండు రోజుల గాలింపు తర్వాత చిక్కిన రియాజ్

మూడు రోజులక్రితం పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ హత్య చేశాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. టీమ్‌లుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రియాజ్ ఆచూకీ గురించి క్లూ తెలిసింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలోని లారీల్లో తలదాచుకున్నట్టు తెలిసింది. వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. కానీ అతను సమీపంలోని కాలువలోకి దూకి పారిపోయేందుకు యత్నించాడు. కానీ అక్కడే ఉన్న ఓ యువకుడు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో అతనికి రియాజ్‌కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరూ గాయపడ్డారు. ఇద్దర్నీ పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్సరే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపాడు. ఇప్పటికే వైలెంట్‌ ఉన్న రియాజ్‌ ఓ కానిస్టేబుల్‌ను పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రియాజ్‌ ఆసుపత్రిలోనే హతమయ్యాడు.   

అరెస్ట్ సమయంలో రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. అరెస్ట్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించినా సంయమనంతో కాల్పులు జరపలేదని నిజమామాబాద్ సీపీ తెలిపారు. ఇవాళ గన్‌తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అంటున్నారు. 

ఏం జరిగింది?

నిజామాబాద్‌‌‌‌ లో కానిస్టేబుల్‌గా చేస్తున్న ప్రమోద్‌‌ తన అన్న కూతురి కోసం ఆసుపత్రికి మేనల్లుడితో కలిసి వెళ్తున్నాడు. రియాజ్‌కు సంబంధించిన సమాచారం తెలిసింది. వెంటనే రియాజ్‌ను పట్టుకునేందుకు ఖిల్లా ప్రాంతానికి వెళ్లాడు. అతికష్టమ్మీద నిందితుడు రియాజ్‌ను కానిస్టేబుల్ ప్రమోద్  పట్టుకున్నాడు. మేనల్లుడి సాయంతో రియాజ్‌ను మధ్యలో కూర్చోబెట్టుకుని స్టేషన్‌కు తీసుకువెళ్తున్నాడు. మ్యధ్య దారిలో ఓ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో ప్రమోద్ మేనల్లుడిని, ఇంకో బైక్‌పై వస్తున్న ఎస్సై విఠల్‌ను గాయపరిచి రియాజ్ పరారయ్యాడు. 

పోలీసులపై విమర్శలు

నిజామాబాద్ జిల్లాలో బైకుపై తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్‌పై నిందితుడు రియాజ్ దాడి చేసి పొడిచి పోరిపోయాడు. కానిస్టేబుల్‌ను రౌడీషీటర్ హత్య చేసి పారిపోవడం హాట్ టాపిక్ అయింది. పోలీసులకే రక్షణ కరువైందని విమర్శుల వినిపించాయి. ఓ నిందితుడు పోలీసు మీద కత్తితో దాడి చేస్తుంటే స్థానికంగా ఉన్న వాళ్లు వీడియోలు, ఫొటోలు తీశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శలు వచ్చాయి.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget