PM Modi On Kamareddy Road Accident: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటన
PMO About Kamareddy Road Accident : కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం అందిస్తామని పీఎంవో ట్వీట్ చేసింది.
PMO About Kamareddy Road Accident : తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..
కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద ట్రాలీ ఆటో వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 21మందికి గాయాలయ్యాయి. ట్రాలీ ఆటోలో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను . మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి అందజేయబడుతుంది. : ప్రధాని మోదీ
— PMO India (@PMOIndia) May 9, 2022
చికిత్స పొందుతూ మరో ముగ్గురు..
క్షతగాత్రులను చికిత్స కోసం ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆసుపత్రులకు తరలించారు. ఎల్లారెడ్డిలో సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఒకరు చనిపోగా, నేడు మరో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 9 కు చేరుకుంది.
Distressed by the loss of lives due to an accident in Kamareddy district, Telangana. Condolences to the bereaved families and prayers with the injured. Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000: PM Modi
— PMO India (@PMOIndia) May 9, 2022
Also Read: Kamareddy Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి, 21 మందికి గాయాలు