Nizamabad Youth Kidnap: నిజామాబాద్‌లో యువకుడి కిడ్నాప్, చితకబాది కారులో తీసుకెళ్లిన దుండగులు - అమ్మాయి వ్యవహారమే కారణమా!
నిజామాబాద్‌లో సినీ ఫక్కీలో కిడ్నాప్ జరిగింది. ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడి అనంతరం కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
![Nizamabad Youth Kidnap: నిజామాబాద్‌లో యువకుడి కిడ్నాప్, చితకబాది కారులో తీసుకెళ్లిన దుండగులు - అమ్మాయి వ్యవహారమే కారణమా! Nizamabad Youth Abducted at Polytechnic college Ground in Nizamabad District Centre Nizamabad Youth Kidnap: నిజామాబాద్‌లో యువకుడి కిడ్నాప్, చితకబాది కారులో తీసుకెళ్లిన దుండగులు - అమ్మాయి వ్యవహారమే కారణమా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/28/178b4445915033e86f9616fa87903bd91672223878082233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిజామాబాద్‌లో సినీ ఫక్కీలో కిడ్నాప్ జరిగింది. స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో యువకుడ్ని కిడ్నాప్ చేశారు. గుర్తుతెలియని దుండగులు దాదాపు 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న ఓ విద్యార్థిపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. యువకుడి కిడ్నా్ప్ ఘటన నిజామాబాద్ లో కలకలం రేపుతోంది.
యువకుడ్ని కిడ్నాప్ చేసిన దుండగులు..
పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఓ విద్యార్థిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అంతలోనే ఆ యువకుడ్ని కిడ్నాప్ చేసి TS 29 C 6688 గల క్రిటా కారులో తీసుకెళ్లినట్లు సమచారం. కిడ్నాప్ అయిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ కారు బోధన్ కు చెందిన సింగం బాగయ్య యాదవ్ కు చెందినదిగా పోలీసుల గుర్తించారు. నిజామాబాద్ బైపాస్ నుంచి కారు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
కిడ్నాప్ చేయడానికి తీసుకొచ్చిన కారు సింగం బాగయ్య పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. అయితే బాగయ్య అల్లుడు అఖిలేష్ బుధవారం ఉదయం బోధన్ నుంచి ఉద్దేశపూర్వకంగానే కారును నిజామాబాద్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అఖిలేష్ ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకరికి సంబంధించిన ఓ యువతిని యువకుడు వేధిస్తున్నాడని, మాట్లాడదామని అతడ్ని పాలిటెక్నిక్ గ్రౌండ్ కు రప్పించినట్లు తెలుస్తోంది. మాట్లాడదామని పిలిచిన దండుగులు ఆ యువకుడ్నిపై దాడి చేశారు. అతడ్ని చితకబాదడంతో పాటు తామ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే బోధన్ వైపు తీసుకెళ్లారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా నిందితుల ఆచూకీ కనిపెట్టినట్లు తెలుస్తోంది. నిందితులను, బాధితుడిని బోధన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)