అన్వేషించండి

Nizamabad News: ఎన్‌ఐఏ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం- వాటి ఆధారంగా అనుమానితుల విచారణ!

జిల్లా కేంద్రానికి చెందిన రఫిక్‌ అనే విద్యార్థిని ఎన్ ఐ ఏ అదుపులోకి తీసుకుంది. అయితే రఫీక్ తండ్రి మాత్రం పీఎఫ్‌ఐ కార్యకలాపాలతో తన కొడుక్కి ఎలాంటి సంబంధంలేదని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో సోదాలతో హీట్ పుట్టించింది ఎన్ ఐ ఏ. అదుపులోకి తీసుకున్న నిందితులను విచారిస్తోంది. జిల్లా పోలీసులు మొదట గుర్తించి శిక్షణ ఇచ్చిన పీఎఫ్ఐ వ్యక్తితోపాటు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఒకేసారి దాడులు నిర్వహించడం అది నిజామాబాద్‌ కేంద్రబిందువు కావడం హాట్ టాపిక్ గా మారింది.

జిల్లా కేంద్రానికి చెందిన రఫిక్‌ అనే విద్యార్థిని ఎన్ ఐ ఏ అదుపులోకి తీసుకుంది. అయితే రఫీక్ తండ్రి మాత్రం పీఎఫ్‌ఐ కార్యకలాపాలతో తన కొడుక్కి ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. తన కొడుకు డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడని తెలిపారు. పీఎఫ్‌ఐ సంస్థ నిర్వహించే కరాటే తరగతులకు హాజరయ్యాడు. ఎన్‌ఐఏ అధికారులు ఉదయం 3 గంటలకు వచ్చి తనిఖీ చేసి తమ కొడుకును తీసుకెళ్లారని తెలిపారు.

జిల్లాలో ఏకకాలంలో 23 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది ఎన్ ఐ ఏ. జిల్లాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యక్రమాలపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసింది. నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగించారు. పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. కొంతమందికి నోటీసులు ఇవ్వడంతోపాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో పది మందికి ఈ నెల 19న ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులను ఇచ్చారు. పీఎఫ్‌ఐకి సంబంధించిన కార్యకలాపాలు పరిశీలించడంతోపాటు అనుమానితులకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌, సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పాస్‌పోర్టులు, ప్రింటర్‌లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి జిల్లాకు ఎన్‌ఐఏ అధికారులు ఎన్‌ఐఏ సీనియర్‌ ఎస్పీ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి అధికారులు జిల్లాకు చేరుకున్న విషయం తెలిసిందే...  ఇద్దరు డీఎస్పీలు, 40 మంది ఇన్స్‌పెక్టర్‌లతో పాటు ఇతర సిబ్బంది బృందాలుగా విడిపోయి  దాడులు నిర్వహించారు.

జిల్లా పోలీసుల సహకారంతో జిల్లాలోని 23 ప్రాంతాల్లో సోదాలను నిర్వహించారు. నిజామాబాద్‌ నగరంలోని ఆటోనగర్‌, బాబన్‌సాపహాడ్‌, మాలపల్లి, అర్సపల్లి, నిజాంకాలనీ, పూలాంగ్‌, హస్మీకాలనీ, గుండారం, ఎడపల్లిలోని ఎంఎస్సీ ఫారం, ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌, బోధన్‌లోని రాకాసిపేట, శక్కర్‌నగర్‌ ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి 11గంటల వరకు సోదాలు నిర్వహించారు. అనుమానితులకు సంబంధించిన సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్‌ అకౌంట్‌ను పరిశీలించారు. పీఎఫ్‌ఐలో ఎంతకాలంగా సభ్యులుగా ఉన్నారు? ఏయే ప్రాంతాలకు వెళ్లారు? ఎక్కడ శిక్షణ తీసుకున్నారో వంటి అంశాలపై ఆరా తీశారు.

నగరానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థి సమీర్‌ ఈ మధ్యనే కేరళకు వెళ్లి కొన్నిరోజులు ఉండి రావడంతో ఆ విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థికి సంబంధించిన సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ను సీజ్‌ చేశారు. అతని తండ్రికి నోటీసు అందజేయడంతోపాటు ఎన్‌ఐఏ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో వివరాలు సేకరించడంతోపాటు కొంతమంది పాస్‌పోర్టులను కూడా ఎన్‌ఐఏ అధికారులు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో జరుగుతున్న కార్యకలాపాలపై జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుపైనే ఎన్‌ఐఏ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. కార్యకలాపాలు పెద్దస్థాయిలో ఉండడంతో పూర్తి వివరాలు సేకరించిన అధికారులు.. ఏకకాలంలో ఉభయ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు.

జిల్లా పోలీసులు తమకు అందిన సమాచారం ఆధారంగా జూలై 4వ తేదీన నగరం పరిధిలోని గుండారంలో దాడులు నిర్వహించారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేరున కార్యకలాపాలు నిర్వహిస్తున్న అబ్దుల్‌ ఖాదర్‌ను అరెస్టు చేశారు. ఆయన ద్వారా వివరాలను సేకరించడంతోపాటు మొత్తం 28 మందిపై కేసు నమోదు చేశారు వీరిలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేరున కరాటే తరగతులు నిర్వహించడంతోపాటు లీగర్‌ అవేర్‌నెస్‌ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. జిల్లాకు చెందిన యువతతోపాటు జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మొత్తం 400 మందికి నగరంలోని గుండారం పరిధిలో ఈ శిక్షణను కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తు లో తేల్చారు. కాగా, ఎన్‌ఐఏ అధికారులు రెండు నెలల క్రితం ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌లో సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఎన్‌ఐ ఏ కార్యాలయానికి రావాలని నోటీసులు పంపించారు. తర్వాత విచారణ చేశారు. ఉమ్మడి రాష్ట్రం పరిధిలో ఎవరెవరు శిక్షణ పొందారో వివరాలు సేకరించారు.

నిజామాబాద్‌ కేసుతోనే దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ ఐ ఏ. నిజామాబాద్‌లో జూలై 4న నగర  6వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసు ఆధారంగానే ఎన్‌ఐఏ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఏకకాలంలో సోదాలను నిర్వహించారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. నిజామాబాద్‌లో అబ్దుల్‌ ఖాదర్‌ పీఎఫ్‌ఐ సంస్థ పేరున కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు గుండారంలో వీరికి కావాల్సిన శిక్షణ విడతల వారీగా ఇచ్చారు. కరాటే ట్రైనింగ్‌తోపాటు ఇతర శిక్షణను కూడా వారికి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు శిక్షణ పొందినవారి వివరాలను అరెస్టు అయిన వారి ద్వారా సేకరించారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాల వెనక సిమి ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి నిధులు శిక్షణ పొందినవారికి వస్తుండడంతో ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget