News
News
X

MLC Kavitha Helps MBBS Student: చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా, ఎంబీబీఎస్‌ మొత్తం ఫీజు భరిస్తానని హామీ

యూట్యూబ్ లో క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. ఎంబీబీఎస్ కు చదవుకు మొత్తం ఫీజును సాయం చేస్తామన్నారు.

FOLLOW US: 
 
నీట్ లో ర్యాoక్ సాధించిన హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక కు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి  కవిత ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో  అందించారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబీబీఎస్ చదువులో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్సీ కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వాగానికి లోనయ్యారు.  తాను బాగా చదువుకొని ఎమ్మెల్సీ కవిత సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటు అందిస్తానని విద్యార్థిని హారిక అన్నారు.

యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్ ర్యాంకు 
ఆసక్తి ఉంటే నేర్చుకొనేందుకు ఏదీ అడ్డంకి కాదని నిరూపించారు.. ఈ యువతి. యూ ట్యూబ్ లో వీడియో క్లాసులు చూసి నిజామాబాద్ కు చెందిన ఓ స్టూడెంట్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ లో స్టేట్ ర్యాంక్ సాధించారు. ఎన్నో ఫీజులు కట్టి, ప్రత్యక్ష తరగతులకు హాజరయినా కూడా స్టేట్ ర్యాంకులు రావడం కష్టమైన వ్యవహారం. అలాంటిది యూ ట్యూబ్ లో విన్న క్లాసులతో ఈమె ఏకంగా దేశ వ్యాప్తంగా ఉత్తమ ర్యాంకు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజామాబాద్ కు చెందిన ఈ యువతి సాధించిన ఘనత ఇది.

News Reels

నిజామాబాద్ లోని శరత్ కుమార్, అనురాధలకు హారిక, ఈశ్వర్ ఇద్దరు పిల్లలు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూతురు హారిక పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. హారికకు డాక్టర్ కావాలన్న కోరిక ఉన్నా నీట్ కోచింగ్ కు వెళ్లే స్థోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ప్రతి రోజూ యూట్యూబ్ లో వీడియో క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. కాలేజీలో సీటు వచ్చినా ఫీజు, హాస్టల్, బుక్స్ ఫీజులు కలిపి కనీసం రూ.రెండు లక్షల వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతోంది. తాను ఎంబీబీఎస్ చదివేందుకు దాతలు ఆర్థిక సాయం అందించాలని హారిక వేడుకుంటోంది.

Published at : 09 Nov 2022 01:19 PM (IST) Tags: MLC Kavitha MBBS STUDENT Nizamabad News MBBS Youtube clases Kavitha Helps MBBS Student

సంబంధిత కథనాలు

Kamareddy News :  కన్న కూతురే మోసం చేసింది, న్యాయం కోసం వృద్ధ తల్లిదండ్రుల పోరాటం!

Kamareddy News : కన్న కూతురే మోసం చేసింది, న్యాయం కోసం వృద్ధ తల్లిదండ్రుల పోరాటం!

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Minister Harish Rao : గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్, ఎనీమియా ప్రభావిత జిల్లాల్లో అమలు - మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్, ఎనీమియా ప్రభావిత జిల్లాల్లో అమలు - మంత్రి హరీశ్ రావు

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?