(Source: ECI/ABP News/ABP Majha)
Kamareddy రైతుల ప్రాణాలు పోతున్న పట్టింపు లేదు, మందకోడిగా ధాన్యం కొనుగోళ్లు
కామారెడ్డి జిల్లాలో వీడని అలసత్వం, కల్లాల్లోౌనే నీరసించి పోతున్న రైతులు. కర్షకుల ప్రాణాలు పోతున్న పట్టించుకోని యంత్రాంగం. లారీల కొరతతో కల్లాల్లోనే దాన్యం నిల్వలు. పడరాని పాట్లు పడుతున్న రైతులు.
కామారెడ్జి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎదురుచూసి నీరసించి రైతుల ప్రాణాలు పోతున్నా అధికార యంత్రాంగంలో చలనం రావట్లేదు. నానాటికి పరిస్థితి దిగజారుతూనే ఉంది. మరోవైపు ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయం రైతులను మరింత కుంగదీస్తోంది. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియక కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు లారీల కొరత, మరోవైపు అన్‌లోడింగ్ సమస్యలతో ధాన్యం సేకరణ మరింత ఆలస్యంగా నడుస్తోంది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం ఆరబెడుతున్నారు. 17శాతం లోపు తేమ ఉంటున్నా కాంటాలు వేయడం లేదు. ఇప్పటికే పూర్తయినవి తరలించాకే మిగతా వారికి వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కొనుగోలు రెండు మూడ్రోజులకోసారి లారీ వస్తోంది. దాన్యం కొనుగోళ్లలో ఇప్పటికే ఆలస్యం అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.
రైతుల గుండెలు ఆగుతున్నా పట్టింపులేదు
వరి దాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఇప్పటికే ఇద్దరు రైతులు కేంద్రాల్లో కుప్పకూలి మరణించారు. అయినా అధికారుల్లో చలనం రావట్లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో చాలా చోట్ల కల్లాల్లోనే దాన్యం నిల్వలు ఉన్నాయి. కొనుగోళ్ల విషయంలో అధికార యంత్రాంగం వేగం పెంచటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే కాల్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవటంతో ... ఎప్పుడు వర్షం వస్తుందోనన్న భయం రైతులను వెంటాడుతూనే ఉంది. కొనుగోళ్లు త్వరగా చేపడితే రైతుల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే జిల్లాలో కొనుగోళ్లు పూర్తి కావాలి కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ జరగలేదు. కామారెడ్డి జిల్లాలో మొత్తం ధాన్యం సేకరణ లక్ష్యం 5.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు కేవలం 3.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగింది. కొనుగోళ్లలో ఇదే ఇలాగే జాప్యం జరిగితే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో కనిపించని పర్యవేక్షణ
కొనుగోళ్ల విషయంలో అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. రైతులు కల్లాల వద్దే రాత్రనకా పగలనకా నిరీక్షిస్తున్నారు. విసిగి వేసారి పోతున్నారు. ధాన్యం సేకరణలో వేగం పెంచాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగలో చలనం లేదని రైతులు అంటున్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !