By: ABP Desam | Updated at : 09 Dec 2022 03:04 PM (IST)
Edited By: jyothi
ఆడ బిడ్డ పుడితే ఈమె దగ్గర వైద్యం ఫ్రీ
Kamareddy News: గర్బణి స్త్రీలకు అండగా నిలుస్తున్నారు ఆ వైద్యురాలు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో డెలవరీ అయిన మహిళలకు ఆడ బిడ్డ పుడితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేస్తున్నారు. గర్బిణీ స్త్రీలకు పురుడు పోసి ఆడ బిడ్డకు జన్మనిస్తే వారి వద్ద రూపాయి కూడా ఆశించకుండా ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఓ ప్రైవేట్ వైద్యురాలు. వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవునితో సామానం అని అర్థం. ఆ మాటలను నిజం చేస్తున్నారు ఆమె. గర్భిణీ మహిళలకు ఆడబిడ్డ పుడితే ఫ్రీ వైద్యం అందిస్తున్నారు. సమాజంలో ఆడబిడ్డలు పుడితే వారి వైద్యానికి అయ్యే ఖర్చును కూడా భారంగా భరిస్తున్నారనే ఉద్దేశంతో వారి డెలివరీకి అయ్యే ఖర్చు రూపాయి కూడా తీసుకోకుండా నార్మల్, సిజేరినయన్ చేసిన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. తమ కుటుంబంలో ఆందరూ ఆడ పిల్లలే కావడమే అందుకు కారణం అని డాక్టర్ శ్రావణిక రెడ్డి చెబుతున్నారు.
నార్మల్ డెలివరీ కానప్పుడే సిజేరియన్లు..
కామారెడ్డి జిల్లా కేంద్రలోని మాతృశ్రీ హాస్పిటల్ గర్బీణిలకు ఉచితంగా కాన్పులు చేస్తున్నారు. ఆర్థికంగా బాధపడుతున్న చాల కుటుంబాలల్లో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించే వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు స్త్రీ వైద్య నిపుణురాలు శ్రావణిక రెడ్డి. గత మూడు నెలల్లో 30 మంది ఆడబిడ్డలకు జన్మనిచ్చిన గర్బీణిలకు ఉచితంగా డెలివరీ చేశారు. అయితే ఎక్కువగా నార్మల్ డెలివరీలు చేసేందుకే ఆమె మొగ్గు చూపుతున్నారు. నార్మల్ డెలివరీ కానీ సమయంలోనే సిజేరినయన్ చేస్తున్నారు. ఆసుపత్రిలో గర్బీణిలు ఆడ బిడ్డకు జన్మనిస్తే రూపాయి కూడా ఆశించాకుడా వైద్యం అందిస్తూ అండగా ఉంటున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెలివరీకి తీసుకెళ్తే ఈ రోజుల్లో కనీసం రూ. 40 వేలు అడిగారని బైంసాకు చెందిన ఓ వ్యక్తి చెబుతున్నారు. తాను కూలీ పని చేసుకుంటూ.. తన వద్ద అంత డబ్బు లేదని తన కూతురిని ఉచిత కాన్పులు చేస్తున్న మాతృశ్రీ హాస్పిటల్ తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే తన బిడ్డ ఆడపిల్లకు జన్మనివ్వడంతో.. డాక్టర్ రూపాయి కుడా ఫీజు తీసుకోకుండా పూర్తిగా ఉంచితంగా వైద్యం అందించిందన్నారు. తల్లి బిడ్డ ఇద్దరు కూడా బాగున్నారని.. ఈ రోజుల్లో ఇలాంటి డాక్టర్లను ఎక్కడ చూడలేదన్నారు. డాక్టర్ శ్రావణిక రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చదువుకునే రోజుల్లోనే ఫ్రీగా డెలివరీలు చేయాలనుకున్న శ్రావణిక రెడ్డి
అమ్మాయి పుడితే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అనే ఉద్దేశంతో మూడు నెలల క్రితం నుంచి ఉచిత కాన్పులు చేస్తున్నామని డాక్టర్ శ్రావణిక రెడ్డి చెబుతున్నారు. ఇప్పటి వరకు 30 మంది గర్బీనిలకు ఉచితంగా డెలివరీలు చేశామని.. ముఖ్యంగా అమ్మాయిలు పుడితే పేరెంట్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనే విషయాలను దృష్టిలో పెట్టుకొని చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వారి ఆర్థిక స్థోమత కూడా అంతంత మాత్రమే ఉంటుందనే ఉద్దేశంతో వారికి ఏదైనా ఒకటి చేయాలనే సంకల్పంతో ఇలా ఫ్రీగా చేస్తున్నానని చెబుతున్నారు. తాను కూడా అమ్మాయినని.. అమ్మాయిల సమస్యలు ఏంటో తెలుసని చెబుతున్నారు. తమ ఆసుపత్రిలో మాత్రం నార్మల్ డెలివరీ చేయడానికే ప్రయత్నిస్తున్నామని.. కానీ కుదరని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నార్మల్ డెలివరీస్ పైనే ఫోకస్ చేస్తోందన్నారు. నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని, మొదటి కాన్పులో సిజేరియన్ అయితే రెండవ కాన్నులో సిజేరియన్ చేయాలనేం లేదని.. రెండో కాన్పులో కూడా నార్మల్ చేయొచ్చని అన్నారు. తాను ఎంబిబిఎస్ చదువుకునే సమయంలో గైనిక్ అయితే ఉచితంగా డెలివరి చేయాలనుకున్నాననని వైద్యురాలు తెలిపారు. దాన్నే ఇప్పుడు అమలు పరుస్తున్నానన్నారు.
వైద్యులు అంటేనే కమర్షియల్ గా ఉంటారనేది జగమెరిగిన సత్యం అని కానీ ఇలాంటి డాక్డర్ కూడా ఉంటారా.. అనేల స్త్రీవైద్య నిపునురాలు శ్రావణిక రెడ్డి ఉచిత కాన్పులు చేస్తున్నారు. ఇలాంటి వైద్యులను ఆదర్శంగా తీసుకుని మరింత మంది వైద్యులు తమ సేవలను పేదలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్