అన్వేషించండి

Indrakaran Reddy: రూ.75 కోట్లతో నిర్మించనున్న అంతర్రాష్ట్ర వంతెనకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

Indrakaran Reddy laid foundation stone to high-level bridge:

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పనులను చేపడుతోందన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అచ్చెల్లి - చింతకుంట వంతెన, శివపూర్ - హీరపూర్ వంతెన ప్రారంభించాం, శివపూర్ - హీరాపూర్ రోడ్డుకు భూమి పూజ, పాతట్లగూడ వంతెన ప్రారంభించాం అన్నారు. వీటితో ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. మన్నేవార్ సంఘం భవనానికి భూమి పూజ చేశారు మంత్రి అల్లోల. కౌటాల మండలంలో మొఘడ్ దగడ్ - వైగాం రోడ్డుకు భూమి పూజ, వార్థా నదిపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గుండాయిపేట్ -  నందివర్థా (మహారాష్ట్ర) మధ్య హైలెవల్ అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతరం చింతలమానేపల్లి మండల కేంద్రంలో 133 కె.వి. సబ్ స్టేషన్ కు భూమి పూజ, చింతల్ పాటి - గురుడుపేట్ రోడ్డుకు, చింతలమానేపల్లి - గంగపూర్ రోడ్డుకు, కర్జెళ్లి - బారేగూడ రోడ్డుకు, దిందాలో లో-లెవల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల 4 వేల 16 రూపాయల పెన్షన్ అందించడం అందిస్తున్నాం. మహిళా సంక్షేమం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు సకాలంలో సరైన పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. ప్రసవం తర్వాత బాలింతలకు కేసీఆర్ కిట్ అందించి వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. 

వెనుకబడిన తరగతులు, మైనారిటీల కొరకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని అందిస్తున్నాం. గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేనివారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

గణేశ్ శోభాయాత్రలో మంత్రి డాన్స్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ గణేష్ మండపం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భక్తులతో కలిసి నృత్యాలు చేశారు. అంతకుముందు నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అలాగే జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ కూడా భక్తులతో కలిసి డ్యాన్స్ చేసి అలరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget