గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
Telangana Assembly Election 2023: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
![గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ CM KCR public blessing meeting in Adilabad district on Thursday గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/b020299c7f8b021e0cb7a67b5e20cd451700070474854233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించే, ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఆదిలాబాద్ డైట్ మైదానంలో సభా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించి ఏర్పాట్ల పట్ల పలు సూచనలు చేవారు.
ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో కేవలం 9 ఏళ్లలోనే తెలంగాణను రోల్ మాడల్ గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు చెందుతుందన్నారు. ప్రజా సంక్షేమాలను ప్రజల ఇంటి వద్దకు చేర్చిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని.. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతూ సిఎం కేసీఆర్ జిల్లాకు రావడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా తనకు మరోసారి ఆదిలాబాద్ ను మరింత అభవృద్ధి చేసేదిశగా అవకాశం కల్పించారు. కావునా రేపటి ప్రజా ఆశీర్వాద సభను నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసం అని కేసీఆర్ అన్నారు. బుధవారం సాయంత్రం ఎల్లారెడ్డి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన్నాడు కరెంటు లేదు..తాగునీరు, సాగునీరు లేదు. రైతుల ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. అంతా గందరగోళంగా ఉండేది. మిషన్ కాకతీయలో భాగంగా నేను కూడా సదాశివ నగర్ చెరువులో తట్ట మోసిన. గులాబీ జెండా పుట్టిన్నాడు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన చెందిన విఠల్ రెడ్డి ‘‘మూగబోయిన..’’ అనే గేయాన్ని అద్భుతంగా రాసినాడు.
రాష్ట్రం బాగుపడిందా లేదా అనడానికి ప్రధాన గీటురాళ్లు..తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం. ఇవ్వాల తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదిన్నరలోనే అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ను ఇచ్చాం. తలసరి విద్యుత్ వినియోగంలో నేడు తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. మిషన్ భగీరథ’తో మంచినీళ్ల బాధ పోగొట్టుకున్నం. కామారెడ్డి వెనుకబడి ఉందనే కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నా. హైదరాబాద్ స్టేట్’గా ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ ఆనాడు ఆంధ్రాలో కలుపడం వల్ల మనం 58 ఏండ్లు గోసపడ్డం.
15 ఏండ్లు కొట్లాడితే అనేక మంది పిల్లలు చనిపోయిండ్రు. ఉద్యోగస్తులు సకల జనుల సమ్మె చేసిండ్రు. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’ అని మొండిగా మనం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంచం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చేనాటికి రైతులకు అనేక సమస్యలు ఉండేవి. రైతు బంధు’ను పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే రూ.5 లక్షల రైతు బీమా వచ్చేలా చేశాం. హైదరాబాద్ లో ఉన్నవాళ్లు కూడా నేడు గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నరు. 3 గంటల కరెంటుతో పొలం పారుతదా? రైతులు వాడేదే 3 లేదా 5 హెచ్.పి.మోటార్లు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా మోటార్లున్నయి. 10 హెచ్.పి. మోటార్లను కొనాలంటే ఎవరు పైసలియ్యాలె. ‘ధరణి’ తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తయి?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)