అన్వేషించండి

Nirmal News: బాసర ట్రిపుల్ ఐటీలో తరగతులు ప్రారంభం

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి నిరసనలతో అలసిన విద్యార్థులు తరగతి గదుల్లో చదువులతో కుస్తీ పడుతున్నారు.

Nirmal News: వారం రోజుల పాటు నిరనసలతో హీటెక్కిన నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్శిటిలో పాఠాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలపై వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు నిన్నటి(మంగళవారం)తో ముగిశాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. తరగతులు ప్రారంభమయ్యాయ్.

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఏడు రోజులపాటు విడతల వారీగా ఆందోళన బాట పట్టారు. ట్రిపుల్ ఐటీకి వైస్ఛాన్సలర్ నియామకం, విద్యార్థుల నిష్పత్తికి ఆధారంగా అధ్యాపకుల భర్తీ, వసతి, తరగతుల్లో మౌలిక సదుపాయాలు, లాప్ టాప్, యూనిఫామ్, బెడ్లు అందించాలని నిరసన చేపట్టారు. ఏడు రోజులపాటు ఎండనకా... వాననకా 24 గంటలపాటు విడతలవారీగా దీక్షలు చేశారు. విద్యార్థుల నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపడానికి జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, యూనివర్సిటీ అధికారులు పలుమార్లు చర్చలు జరిపిన. విద్యార్థులు తమకు హామీలు కాకుండా కాల పరిమితితో కూడిన హామీ కోసం పట్టుబట్టారు. మంత్రి అల్లోల ఇంద్రకరణెడ్డి, ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, కలెక్టర్ ఉన్నత విద్యాశాఖ మండలి వైస్ చైర్మన్ వెంకట రమణతో చర్చలు జరిపినప్పటికీ తగిన హామీ లభించలేదు. చివరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల డిమాండ్లకు విడతల వారిగా తీర్చుతామని చెప్పటంతో నిరసనలకు పుల్ స్టాప్ పడింది.

ట్రిపుల్ ఐటీలో నెలకొన్న ప్రశాంతత...

ట్రిపుల్ ఐటీ యూనివర్సీటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలో గతంలో కాకుండా ఈసారి విద్యార్థులు చేసిన ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీ, విద్యార్థి సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దీనికి తోడు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సైతం యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు విడతల వారిగా ట్రిపుల్ ఐటీలో పనులు ప్రారంభించారు. మొదటగా మరుగుదొడ్లలో ప్లంబింగ్ పనులు ప్రారంభించారు. పనులను వేగవంతం చేశారు. దీంతో విద్యార్థులు సైతం తరగతి గదుల్లో చదువులతో బిజీగా మారారు. మొత్తానికి బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణం ఏడు రోజులు నిరసనలతో హోరెత్తి ప్రస్తుతం ప్రశాంత వాతవరణంలోకి వెళ్లింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి హామీకి నిర్ధిష్ట సమయం

వారం రోజుల్లో ఛాన్స్ లర్ నియామక ప్రక్రియ, 45 రోజుల్లో వీసీ నియామకం.

ప్రొఫెసర్ల నియామకాలు, మిగిలిన విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్‌తో కలిపి ఖాళీల భర్తీ చేయనున్నారు. 

లాప్‌ట్యాప్‌ల పంపిణీ, మూడు నాలుగు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. 

వెయ్యి 50 పడకలు, పరుపులు, వెంటనే 650 పడకలు సిద్ధం. త్వరలో మిగిలినవి సమకూర్చేలా నిర్ణయం.

ఇతర మౌలిక వసతులు, రూ 5.6 కోట్లు వెంటనే మంజూరు, డైరెక్టర్ కు చెక్ పవర్.

ప్లంబింగ్, విద్యూదీకరణ, ప్రతి సమస్యకు అక్టోబర్ 31 లోగా పరిష్కారం 

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Rishi Panchami Celebrations: మథురాల కోలాటం.. లెంగీ నృత్యాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మథుర లభానల ఋషి పంచమి వేడుకలు
మథురాల కోలాటం.. లెంగీ నృత్యాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మథుర లభానల ఋషి పంచమి వేడుకలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget