అన్వేషించండి

కడెం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం- భద్రతపై విచారణ

కడెం ప్రాజెక్టు గేట్ల లిఫ్టింగ్‌లో గత రెండు ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా గురువారం ఒక్కరోజే దాదాపు 703 అడుగులకు చేరుకుంది.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు భారీ వరదలు పోటెత్తాయి. ప్రమాద స్థాయిలో నీరు ప్రాజెక్టు గేట్ల పైనుంచి ప్రవహించింది. ప్రాజెక్టు గేట్లు కూడా సాంకేతిక సమస్యలు ఎదురై తెరుచుకోలేదు. దీంతో ప్రాజెక్టును సెంట్రల్, స్టేట్ డ్యాం సేఫ్టీ (CDSO,SDSO) టీం పరిశీలించింది. 24 మందితో కూడిన బృందం సభ్యులు కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. 

కడెం ప్రాజెక్టుకు గత సంవత్సరం జులై మాసంలో భారీ వరదలు వచ్చినప్పుడు గేట్లు పాడయిపోయాయి. గేట్లు కౌంటర్ వేట్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెప్పారు. సంవత్సరకాలం గడిచిన మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో మళ్లీ సమస్య ఎదురైంది. దాదాపు అదే స్థాయిలో కడెం ప్రాజెక్టుకు జులై 27వ తేదీన భారీ వరద వచ్చింది. అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచి పెట్టేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించారు. అయితే అందులో నాలుగు గేట్లు తెరుచుకోలేదు. చాలా సమయం తర్వాత అందులో రెండు గేట్లు తెరుచుకున్నాయి. మరో రెండు గేట్లు పూర్తిగా తెరుచుకోలేదు. 

తెరుచుకున్న 16 గేట్లలో 11 మాత్రమే ఎలక్ట్రికల్ మోటార్ల ద్వార లిఫ్ట్ అయ్యాయి. మిగతా ఐదు గేట్లు స్థానిక యువకుల సహాయంతో జెసిబితో చెత్త తొలగించి ఎత్తే పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు 18 గేట్లలో 16 గేట్లు మాత్రమే ఎత్తి నీటిని విడిచి పెట్టారు. 

కడెం ప్రాజెక్టు గేట్ల లిఫ్టింగ్‌లో గత రెండు ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా గురువారం ఒక్కరోజే దాదాపు 703 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు గేట్లై నుంచి నీరు ఓవర్‌ఫ్లో అయింది. అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ప్రాజెక్టు గేట్లు తెరవకపోవడం, నీరు ఓవర్‌ ఫ్లో కావడంతో డ్యాం సేఫ్టీ అధికారులు స్పందించారు. సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ & డ్యాం సేఫ్టీ నిపుణులు ఏ.బి పాండ్య అధ్వర్యంలో 24 మంది బృందం ప్రాజెక్టును పరిశీలించారు. స్థితిగతులను చూశారు. భారీ వరదలకు ప్రాజెక్టు తట్టుకునే పరిస్థితుల్లో ఉందో లేదో ప్రాజెక్టు సేఫ్టీ మేజర్స్ గెట్లలో ఎదురైన సమస్యలు, కోతకు గురైన ప్రాంతాలను సెంట్రల్,స్టేట్ డ్యాం సెప్టీ CDSO, SDSO బృందం సభ్యులు పరిశీలించారు. 

వరదలకు గెట్లలో ఎదురైన సమస్యలను ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులు సేఫ్టీ సమస్యల పట్ల స్టేట్ సెంట్రల్ ఉన్నతాధికారులకు నివేదికలు అందించినట్లు వారు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget