BC Declaration Success Meeting: ఈ 15న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ: మహేష్ కుమార్ గౌడ్
BC Reservations in Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్రం ఆమోదించి కేంద్రానికి బిల్లులు పంపిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

TPCC Chief Mahesh Kumar Goud | హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జరుగకుండా బీజేపీ అడ్డుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. ఎప్పుడూ మతం, దేవుడి పేరుతోనే బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “కామారెడ్డి గడ్డ మీద బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాం. ఆ హామీ మేరకు 3 బిల్లులు తీసుకొచ్చి, అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపించాం. కానీ వాటిని బీజేపీ అడ్డుకుంటోంది. బీసీల విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు?. కేసీఆర్ ఫ్యామిలీలో అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా రావడంతో మాజీ ఎమ్మెల్సీ కవిత బయటపెట్టింది. అదే విషయాన్ని ఐదేళ్ల కిందట చెప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు నమ్మేవారు’’ అన్నారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.






















