By: ABP Desam | Updated at : 13 Mar 2023 08:57 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
రేవంత్ రెడ్డి
Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఓట్ల కోసం పాము ముంగిస ఆట ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు దేశంలో 150 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. మిత్ర పక్షాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీడియాతో చిట్ చాట్ లో అన్నారు రేవంత్ రెడ్డి. త్వరలో కాంగ్రెస్ లో కొత్త నాయకుల చేరికలుంటాయన్నారు. డీఎస్ చేరిక అధిష్ఠానం పరిధిలో ఉందన్నారు. ఇప్పటికే రెండు సార్లు సోనియాను డీఎస్ కలిశారని అన్నారు. నాయకులు అభ్యంతరం పెట్టినా చేరికలు అపొద్దని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. పార్టీ మేలు జరిగే అవకాశం ఉంటే కచ్చితంగా చేర్చుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టామన్న రేవంత్ ... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ముందుగానే ప్రకటిస్తామన్నారు. భట్టి విక్రమార్క యాత్ర ఏఐసీసీ కార్యక్రమం అన్నారు. తాను కూడా భట్టి పాదయాత్రకు హాజరవుతానని చెప్పారు రేవంత్. ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవ్నారు. బీజేపీ,బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
రూ.1000 కోట్లు ఎలా వచ్చాయ్
ఫామ్ హౌజ్ పై డ్రోన్ ఎగురవేశానని దేశ ద్రోహులను పెట్టిన జైలులో తనను 15 రోజులు ఉంచారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఒక శాతం మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రు.1000 కోట్ల నిధులు వచ్చాయిని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం లేదన్నారు. రూ.100 కోట్ల కోసం రాద్దాంతం చేస్తున్న బీజేపీ నేతలు రూ. 1000 కోట్ల నిధులపై ఎందుకు స్పందించటo లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ వీధి నాటకం ఓట్ల కోసం పాము ముంగిస ఆట ఆడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు రేవంత్.
కొడంగల్ నుంచి పోటీ
బీజేపీ ప్రయార్టీలో తెలంగాణ లేదు. ఇక్కడి నేతలు లేరు. కిషన్ రెడ్డికి బాత్ రూమ్ లు కడిగే శాఖ ఇచ్చారు. పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారు కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చింది. సీట్ల వారిగా సర్వే చేయడం లేదు. ప్రజల మూడ్ పై సర్వే జరుగుతుంది. కేసీఆర్ ను సీరియస్ గా తీసుకోవడం మానేశాo. సీఎంను ఆ పార్టీ నేతలు కూడా సీరియస్ తీసుకోవడం మానేశారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదు. అది భ్రమ మాత్రమే. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. కొడంగల్ లో పోటీ చేయాలని అనుకుంటున్నా కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. తెలంగాణలో స్వేచ్ఛ లేదు. ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది.
ఈ పెద్దమనిషిది దురాశ కాదు…
— Revanth Reddy (@revanth_anumula) March 13, 2023
అత్యాశ కాదు…
తనకు కావాల్సింది బతుకు భరోసా…
కేసీఆర్ ఇవ్వనిది… కాంగ్రెస్ ఇచ్చేది ఆ భరోసానే.#YatraForChange #ByeByeKCR #HaathSeHaathJodo pic.twitter.com/Vx9jTSJ6hf
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Breaking News Live Telugu Updates: TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి
MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం
Minister Errabelli : గత పాలకులకు విజన్ లేదు, కేసీఆర్ వచ్చాక ప్రగతి పరుగులు పెడుతుంది- మంత్రి ఎర్రబెల్లి
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్