అన్వేషించండి

Nirmal Viral News: మా ఊళ్లో అంతే.. మగాళ్లవే పండుగలు - బాటిళ్లకు బాటిళ్లు వాయినాలిచ్చేసుకుంటారు!

Men festivals: శ్రావణమాసంలో మహిళలు పూజలు చేసి.. వ్రతాలు చేసుకుని వాయినాలిచ్చికుంటారు. ఇదంతా చూసినా ఆక్కడి మగాళ్లు మాకేం తక్కువ అనుకున్నారు.

Men festivals With Bottles: మహిళల దినచర్యలో పూజలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక శ్రావణ మాసం వంటి ప్రత్యేక మాసాల్లో వారి హడావుడి గురించిచెప్పాల్సిన పని లేదు. వ్రతాలు చేసుకుని వాయినాలు మార్చేసుకుంటూ ఉంటారు. ఈ పూజల్లో మగవాళ్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. వారి పని.. పూజల పేరుతో అయ్యే ఖర్చులు పెట్టుకోవడం.. చూస్తూ ఉండటమే. ఇదేదో బాగుందని..నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలోని పురుషులు తాము కూడా పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అసలు దేవుళ్లకు తమ ఇంటి మహిళలు పూజలు చేస్తున్నారు కాబట్టి.. తాము తమ ఆనందాల కోసం పూజలు చేయాలనుకున్నారు. అందుకే వెరైటీగా.. ఆలోచించారు. చివరికి ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు.                                           

వాయినాల సంప్రదాయం పాటించాలని మగాళ్ల నిర్ణయం

వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం అనే సంప్రదాయాన్ని తమదైన పద్దతికి అన్వయిస్తే ఎలా ఉంటుందా ్ని బాగా ఆలోచించి కొత్త పద్దతిని తీసుకు వచ్చేశారు. దాని ప్రకారం ఓ మంచి ముహుర్తం పెట్టేసుకుని రంగంలోకి దిగిపోయారు. ఫలానా రోజు..ఫలానా చోట.. వాయినాలు ఇచ్చి పుచ్చుకుందామని మాట్లాడుకున్నారు. అ ప్రకారం ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నట్లుగానే అంతా ఆ సమయానికి అక్కడికి వెళ్లారు. 

మద్యం బాటిళ్లను సంప్రదాయంగా ఇచ్చి పుచ్చుకునేలా ఏర్పాట్లు             

చక్కగా చాపలు పర్చుకున్నారు. సెటప్ అంతా రెడీ చేసుకున్నాయి. ఎవరు ఎవరికి ఎలాంటి వాయినాలు ఇవ్వాలో కూడా రెడీ చేసుకున్నారు. బొట్లు పెట్టడం.. కండువాలు కప్పడం వంటి సంప్రదాయాలను కూడా మర్చిపోలేదు. అన్ని ఏర్పాట్లు చేసుకుని  వాయినాల కార్యక్రమం ప్రారంభించారు. ఇంతకూ వారిచ్చుకుంటున్న వాయినాల్లో ఏముంటాయంటే.. మద్యం బాటిల్స్.  స్నేహితులను పిలుచుకొని ఒకరికొకరు బొట్లు పెట్టుకొని, కండువాలు సమర్పించుకొని, మందు బాటిల్లతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.                          

కించ పరుస్తున్నారని కొంత మంది ఆగ్రహం - వీడియోలు వైరల్                            

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలో యువకులు మగవాళ్ళ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు రావడంతో వైరల్ గా మారాయి. ఏదేమైనా మగవారి వాయనాలు పలువురికి నవ్వులు తెప్పిస్తున్నాయి. అయితే నవ్వులాటకు అయినా ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదని.. సంప్రదాయాలను, మహిళలు చేసే పూజల్ని కించ పర్చడం మంచిది కాదని కొంత మంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                                           

 

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget