అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం అయింది. వందల సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మౌలిక సదుపాయాలపై విమర్శలు వస్తున్నాయి.

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల 7 రోజులు విద్యార్థులు శాంతి యుతంగా నిరసనలు తెలిపినా వారి సమస్యలు అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో మాట్లాడి హామీలు తీరుస్తామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ ట్రిపుల్ ఐటీ కథ మొదటికొచ్చింది. 350 మందికి పైగా విద్యార్థులు ఆహారం వికటించి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలిస్తోంది. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యతవహిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్లు అదే తప్పిదాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు తరలి వచ్చి విద్యార్థుల ఆరోగ్య విషయాలను ఆరా తీశారు.

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు,  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

ఫుడ్ పాయిజన్ 

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థినుల్లో  29 మంది జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 17 మంది, నవీపేటలోని ప్రైవేటు నర్సింగ్ హోంలో మరో 12 మంది చేరారు. వీరిలో కోమలి, హరిత అనే విద్యార్ధినుల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో శుక్రవారం మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గంట వ్యవధిలోనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. తోటి విద్యార్థినులు 108కు ఫోన్ చేయడంతో అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రులకు తరలించారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించామని జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గోపికృష్ణ రాయుడు తెలిపారు. ఇద్దరు విద్యార్ధినులకు బీపీ తక్కువ కావడం వల్లే అస్వస్థతతో ఉన్నారని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. డీఎంహెచ్ వో డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. 

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు,  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

విద్యార్థులను పరామర్శించిన బలమూరి వెంకట్  

అస్వస్థతకు గురైన విద్యార్థులను పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఎన్ఎస్యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ నిజామాబాద్ నగరంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శనివారం ఉదయం పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు కూడా విద్యార్థుల సమస్యలను, వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

Basara IIIT News : బాసర ట్రిపుల్ ఐటీలో మారని పరిస్థితులు,  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!

కొనసాగుతోన్న అరెస్టులు 

బాసర ట్రిబుల్ ఐటీలో శుక్రవారం అస్వస్థతకు గురై కోలుకుంటున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన ఏఐసీసీ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ లను  ట్రిపుల్ ఐటీ లోపలకు వెళ్లకుండా పోలీస్ లు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గేటు ముందు ధర్నా చేపట్టటంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కొద్ది సేపు ట్రిబుల్ ఐటీ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక క్యాంపస్ లోపల కూడా విద్యార్థులు నిరసన చేపట్టారు. శుక్రవారం విద్యార్థుల అస్వస్థతకు కారణమైన కుళ్లిన కోడిగుడ్లను డైరెక్టర్ కార్యాలయం ముందు పెట్టి ఆందోళన చేపట్టారు. సంఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని క్యాంపస్ లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముందు ABVP నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget