అన్వేషించండి

Rajanna Siripattu : అంతర్జాతీయ వేదికపై రాజన్న సిరిపట్టు బ్రాండ్ ఆవిష్కరణ, వినూత్న ఉత్పత్తులపై మంత్రి కేటీఆర్ హర్షం

Rajanna Siripattu : న్యూజిలాండ్ లో వేదికగా సిరిసిల్ల పట్టుచీర “రాజన్న సిరిపట్టు” బ్రాండ్ అవిష్కరించారు. రాజన్న సిరిపట్టును ఆవిష్కరించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Rajanna Siripattu : సిరిసిల్ల పట్టుచీర “రాజన్న సిరిపట్టు” వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారుచేసిన రాజన్న సిరిపట్టు పట్టుచీరలు న్యూజిలాండ్ కి చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా న్యూజిలాండ్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. రాజన్న సిరిపట్టు చీరలను ప్రారంభించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన రాజన్న సిరిపట్టు ఆవిష్కరణ సంతోషాన్ని ఇస్తుందని కేటీఆర్ అన్నారు. న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధకృష్ణన్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ లను  మంత్రి అభినందించారు. తెలంగాణ చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు నేడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే హరిప్రసాద్ లాంటి నేతన్నలు సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలు ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలు నేస్తున్నారన్నారు. న్యూజిలాండ్ లో జరిగిన రాజన్న సిరిపట్టు బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. సిరిసిల్ల రాజన్న సిరి పట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.  

రాజన్న సిరిపట్టు 

నాలుగేళ్ల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు తెలంగాణ కు వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్లలోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకున్నారు. అప్పుడే సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ తో పట్టుచీరలు తయారు చేయించి, అమెరికా, యూకే, న్యూజిలాండ్ వంటి ఆరు దేశాల్లోని తెలిసిన వారికి, సిరిసిల్ల పట్టుచీరలకు ఆర్డర్లు ఇప్పించారు. అయితే సిరిసిల్ల పట్టుచీరలకు ఒక బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో “రాజన్న సిరిపట్టు”గా నామకరణం చేసి, న్యూజిలాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ తో, 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆ తర్వాత సిరిసిల్ల పట్టుచీరలతో ఒక ఫ్యాషన్ షోను నిర్వహించారు. “రాజన్న సిరిపట్టు” పేరుతో సిరిసిల్ల పట్టు చీరలకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్న తన ఆలోచనకు, అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రవాసీ మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తెలిపారు. నేతన్న హరిప్రసాద్ ఒక్కరితో మాత్రమే ప్రారంభమైన పట్టు చీరల ఉత్పత్తి, ప్రస్తుతం జిల్లాలో 40 మందికి పైగా నేత్నలకు ఉపాధి లభిస్తుందని సునీత తెలిపారు. 

ఎంతో సంతోషంగా ఉంది 

నేతన్నల ఉత్పత్తులను ముఖ్యంగా “రాజన్న సిరిపట్టు” పట్టు చీరలను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషాన్ని ఇచ్చిందని న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు పట్టు చీరలు అంటే ఎంతో ఇష్టమని, తెలంగాణకు చెందిన బతుకమ్మ సంబరాల కోసం ప్రవాసీలు తనని ఆహ్వానించిన ప్రతిసారి, వాటినే ధరిస్తానన్నారు. పట్టుచీరలతో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. గతంలో సిరిసిల్లకు చెందిన ఒక పట్టుచీరను ధరించి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విషయం ట్విట్టర్ ద్వారా తెలుసుకొన్న కేటీఆర్,  హైదరాబాద్ లో ఒక సమావేశంలో కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP DesamRaptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABPPro Kodandaram Interview | ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆదివాసీలకు అండగా కోదండరాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Rathnam Movie Review - రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Best Horror Movies on OTT: వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
Embed widget