MLA Balaraju : "బాలరాజు" కష్టం ఎవరు తీరుస్తారు ? ఎమ్మెల్యే అనే గౌరవం కూడా చూపరా ?
ఈటల గెలిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేసిన అచ్చం పేట ఎమ్మెల్యేకు ఇప్పుడు ఆ సవాల్‌ను పదే పదే గుర్తు చేస్తున్నారు జనం. దాంతో ఆయన అసహనానికి గురవుతున్నారు.
రాజకీయాల్లో వంద అంటాం ! అన్నీ పట్టించుకుంటామా ?. అని రాజకీయ నేతలు అంటూ ఉంటారు. నిజంగానే వారు పట్టించుకోరు. అనాదిగా ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ప్రజలు పట్టించుకున్నప్పుడే సమస్య వస్తుంది. ఇప్పుడు అదే సమస్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వచ్చింది. ఆయన అన్న ఓ మాటను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే ఆయనకు ఫోన్ చేసి పదే పదే గుర్తు చేస్తున్నారు. " సార్ మీరిలా అన్నారు..మరెప్పుడు చేస్తారు?" అని అడుగుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ దెబ్బకు ఆయనకు బీపీ పెరిగి అప్పుడప్పుడు కొంత మందిని చెడామడా తిట్టేస్తున్నారు. పాపం వాటిని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు కొంత మంది. దీంతో బాలరాజుకు మనశ్శాంతి లేకుండా పోయింది.
Also Read : కోమటిరెడ్డి సొంత బాట .. రేపట్నుంచే ఉద్యమం చేస్తానన్న ఎంపీ !
అసలేం జరిగిందంటే హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం పని చేసిన ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు ఒకరు. ఆయన ప్రచారంలో ఉండగా ఓసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఫలితం వచ్చింది. ఈటల రాజేందర్ గెలిచారు. దీంతో బాలరాజుకు చిక్కులు ప్రారంభమయ్యాయి. ఆయన చేసిన సవాల్‌ను బాలరాజు అప్పటికే మర్చిపోయారు. కానీ నెటిజన్లు మాత్రం మర్చిపోలేదు. వెంటనే గువ్వల బాలరాజు కూడా మాట నిలబెట్టుకోవాలని సోషల్ మీడియాలో క్యాంపైన్ ప్రారంభించారు.
Also Read : పన్నులు తగ్గించాలని ఆందోళనలు .. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ సెగ !
ఓ వైపు సోషల్ మీడియాలో అలా ప్రచారం జరుగుతూండగానే కొంతమంది అత్యుత్సాహంతో ఆయనకే ఫోన్లు చేసి "ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు సార్ " అని అడగడం ప్రారంభించారు. అలా నాలుగు గోడల మధ్య అడిగితే సరే ..కానీ ఫోన్‌లో అడిగి రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ ఆయనకు బీపీ తెప్పిస్తున్నాయి. గద్వాల నుండి ఓ బీజేపీ కార్యకర్త ఇలాగే ఫోన్ చేసి అడిగే సరికి ఆయన బీపీ పెరిగిపోయింది. ఆయన అనరాని మాటలన్నారు. ఆ ఆడియోను ఆయన ఆన్ లైన్‌లో పోస్ట్ చేశారు. అవన్నీ వైరల్ అవుతున్నాయి.
Also Read : టీఆర్ఎస్‌కు వరుస కష్టాలు .. "విజయ గర్జన"కు స్థలం సమస్య .. ఎక్కడికెళ్లినా రైతుల ఆందోళన !
బాలరాజు మాత్రం రాజకీయాల్లో అనేక మంది సవాళ్లు చేస్తారని అంత మాత్రాన ఇలా వెంట పడటం ఏమిటని మథనపడుతున్నారు. అయితే ఆయన తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఫోన్లు ఎత్తడం మానేశారు. కాస్త మానసిక ప్రశాంతత కోసం మీడియాకు కూడా దూరంగా తిరుగుతున్నారు.
Watch Video : సీనియర్లకు అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి... బైపోల్ ఓటమితో విమర్శల వెల్లువ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి