అన్వేషించండి

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక: టీఆర్ఎస్ నేతల్లో కలవరపాటు! అదే రిపీట్ అవుతుందని టెన్షన్ - హైకోర్టులో పిటిషన్

కొన్ని గుర్తులు కారు గుర్తును పోలి ఉండడంతో తమకు రావాల్సిన ఓట్లు చీలతాయని నేతలు ఆందోళన చెందుతున్నారు.

Munugode Bypoll News: మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేసిన స్వతంత్రులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు టీఆర్ఎస్ పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొన్ని గుర్తులు కారు గుర్తును పోలి ఉండడంతో తమకు రావాల్సిన ఓట్లు చీలతాయని నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్‌ను ఇతరులకు కేటాయించ వద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు వేసింది. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేస్తుంది. 

పిటిషన్‌లో టీఆర్ఎస్ వివరాల ప్రకారం.. ‘మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఇవ్వ వద్దని ఈ నెల 10న ఈసీని కలసి విజ్ఞప్తి చేశాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈవీఎంలో స్టాంప్‌ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడతారు. రోడ్‌ రోలర్‌ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించింది. 

మభ్యపెడుతున్న రోడ్డు రోలర్ గుర్తు!

2018లో రోడ్డు రోలర్‌ గుర్తుకు జహీరాబాద్‌లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీపీఐకి 1,036 ఓట్లే పోలయ్యాయి. డోర్నకల్‌లో రోడ్డురోలర్‌కు 4,117 ఓట్లు, సీపీఐకి 1,361 ఓట్లు, మునుగోడులో రోడ్డు రోలర్‌కు 3,569 ఓట్లు, బీఎస్పీకి 743 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్‌ రోలర్‌ గుర్తు కారును పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2 వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి గుర్తులను కేటాయిస్తే టీఆర్‌ఎస్‌ నష్టపోయే అవకాశం ఉందని పిటిషన్ లో వివరించింది. 

ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సోమవారం రాత్రి గుర్తులను కేటాయించారు. కొందరు అభ్యర్థులు టీఆర్‌ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే గుర్తులను ఎంచుకోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్‌లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో వాటిని జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వాటిని ఎవరికీ కేటాయించవద్దని టీఆర్‌ఎస్‌ నేతలు చండూరులోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. గత అనుభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని, వాటిని జాబితా నుంచి తొలగించాలని కోరారు.

దుబ్బాకలోనూ అంతే..

గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. కొంత మంది స్వతంత్రులకు కేటాయించిన చపాతీ పీట, కర్ర, రోడ్‌రోలర్‌ గుర్తులు కారు గుర్తును పోలి ఉండడం టీఆర్ఎస్ కు నష్టం చేకూర్చిందని భావించారు. ఇప్పుడు మునుగోడులో గెలుపు అంత్యంత ఆవశ్యకం అయిన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Nellore News: పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
Embed widget