KCR in Flood Affected Areas: వర్షంలోనే వరద ముంపు ప్రాంతాలకు సీఎం కేసీఆర్ - వెంట మంత్రులు, ఉన్నతాధికారులు
Bhadrachalam: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఏటూరునాగారం, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.
KCR in Flood Affected Areas: భారీ వర్షాలతో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ చేరుకున్నారు. నేడు భద్రాచలం పర్యటనకు సీఎం కేసీఆర్ వర్షంలోనే బయలుదేరారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ తో సహా ప్రయాణిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం మరి కాసేపట్లో భద్రాచలానికి చేరుకోనున్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.
వర్షం కురుస్తుననా సీఎం వెనక్కి తగ్గలేదు !
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఏటూరునాగారం బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎగుర రాష్ట్రాల నుంచి వరదతో గోదావరి ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల కారణంగా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. కానీ వర్షం కారణంగా రోడ్డు మార్గంలోనే వరద ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ సర్వేలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పాల్గొననున్నారు.
వర్షంలోనే సీఎం కేసీఆర్ గారి పర్యటన..
— TRS Party (@trspartyonline) July 17, 2022
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. pic.twitter.com/PIz6Fe2r2a
రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితులపై నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉండి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ... రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా భాగం చేశారు. నిన్న రాత్రి వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. వాతావరణం సహకరించకున్నా, వానలోనే వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు.