By: ABP Desam | Updated at : 08 Jan 2023 05:02 PM (IST)
Edited By: jyothi
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం
Nalgonda News: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు శివారు ఎరసాని గూడెం వద్ద హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఖమ్మం వాసులు ఎండీ ఇద్దాక్(21), ఎస్.కే సమీర్(21), ఎస్.కే యాసీన్(18)లుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా.. వేకువ జామున ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.
నూతన సంవత్సరం నాడే హైదరబాద్ లో కారు బోల్తా - ఇద్దరు మృతి
నూతన సంవత్సరం ప్రారంభం రోజే హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ మూడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 07 ఎక్స్ 5195 నంబర్ గల కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పింది. వెంటనే మరో రెండు కార్లను కూడా ఢీకొట్టింది. ఇదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీకొట్టగా.. వారు గాల్లోకి ఎగిరి పడ్డారు. కింద పడి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణం అయిన మణిపాల్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మద్యం తాగి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు పెయింటింగ్ పని చేసుకుంటూ బ్రతికే శ్రీనివాస్,ఈశ్వరిలుగా పోలీసులు గుర్తించారు.
ఇదే టిఫిన్ సెంటర్ వద్ద దాదాపు 25 మంది మృతి
గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాయల్ టిఫిన్ సెంటర్ ఎదురుగా 25 మంది వరకు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా రోడ్డు లోతుగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణం అని పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా ఇటువైపు వచ్చే వారికి ఈ రోడ్డులో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుందని తెలిపారు. కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కారు ఢీకొట్టడంతో హోటల్ ఫ్లెక్సీలు ఊడి పడిపోయాయి.
ఫ్లోరైడ్పై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత- సంతాప తెలియజేసిన మంత్రి కేటీఆర్
TS News Developments Today: కేటీఆర్ నిజామాబాద్ పర్యటన, వరంగల్లో వీరయ్య- తెలంగాణ హైలెట్స్ ఇవే!
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!
Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ పాదయాత్రలో అపశ్రుతి, సొమ్మసిల్లి కిందపడ్డ తారకరత్న
TS News Developments Today: తెలంగాణలో ఇవాళ్టి ముఖ్యమైన అప్డేట్స్ ఇవే
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?