Train Derailed: నల్లగొండ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Telangana News: నల్లగొండ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
Telangana News in Telugu: నల్లగొండ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న గూడ్స్ రైలు ఒక పక్కకు ఒరిగిపోయి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌లోనే ఉంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా బ్రేక్‌లు వేసి.. మిగతా బోగీలు పడిపోకుండా జాగ్రత్తపడ్డారు.
ఈ ప్రమాదం కారణంగా గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో అవి ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. మిర్యాలగూడలోనే శబరి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాల గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. కొన్ని నెలల కిందట ఒడిషాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత ఎక్కడ రైలు ప్రమాదం అని మాట విన్నా ప్రజల్లో భయం, ఆందోళన పెరిగిపోతోంది.
ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్
అటు ఏపీలోనూ మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు భోగీలు బోల్తా పడ్డాయి. గురువారం సాయంత్రం కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొత్తవలస -కిరండోల్ (కేకే రైలు మార్గం)లో ముడి ఇనుము ఖనిజంతో కిరండోల్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న గూడ్స్ రైలు కొరాపుట్-అరకు మధ్యలో పాడువా వద్ద పట్టాలు తప్పింది. రైలులోని మొత్తం భోగీలలోని ఆరు బోగీలు పట్టాలు తప్పగా, మూడు బోల్తాపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడంతో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. లైన్ పునరుద్ధరణకు మరో రెండు రోజుల సమయం పట్టొచ్చని అధికారులు తెలిపారు.