Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. కొద్ది రోజుల్లో నల్గొండలో అదే జరుగుతుందట!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ విష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.
![Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. కొద్ది రోజుల్లో నల్గొండలో అదే జరుగుతుందట! Dubbaka MLA Raghunandan Rao Makes sensational comments over By elections Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. కొద్ది రోజుల్లో నల్గొండలో అదే జరుగుతుందట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/25374b6c9fc81e64bd83d6ffaed3883e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఎం. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కామెంట్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒకటి లేదా రెండు స్థానాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు రానున్నాయని రఘునందన్ రావు వెల్లడించారు. దాని గురించి తమకు ముందే తెలుసని అన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా సిద్ధంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం శేరి గూడెం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ విష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా ఎగబాకిన బంగారం ధర.. ఏకంగా 50 వేలు దాటేసి.. తాజా ధరలివే..
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయంగా ఎదగకుండా తన సొంత పోరాట పటిమతో తాను నమ్మిన హిందూ ధర్మంతో మరాఠా సామ్రాజ్యన్ని పాలించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని రఘునందన్ రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని అన్నారు. అందుకు నిదర్శనమే హుజూరాబాద్ ఎన్నికల ఫలితం అని మాట్లాడారు.
Also Read: 256 జీబీ స్టోరేజ్‌తో రియల్‌మీ కొత్త 5జీ ఫోన్.. ధర ఎంతంటే?
యాసంగి వడ్ల ధాన్యం కొనుగోలు విషయంలో 7 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కొంటోందని రఘునందన్ రావు అన్నారు. అలాంటప్పుడు ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకోలేదని విమర్శించారు. రాష్ట్రం ప్రభుత్వమే ధాన్యం కొన్నదని కేసీఆర్ సర్కార్ చెప్పిందని గుర్తు చేశారు. ఈ ఒక్క సంవత్సరం కేంద్రం కొనలేం అని చెబితే.. తప్పంతా కేంద్రానిదే అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే జైలుకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యే రఘునందన్ రావు తేల్చి చెప్పారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)