(Source: ECI/ABP News/ABP Majha)
NASA SpaceX: ఐఎస్ఎస్ చేరిన స్పేస్‌ఎక్స్ క్రూ3.. మిషన్‌ను నడిపించిన తెలుగోడు.. ఆస్ట్రోనాట్ రాజాచారి ఎవరో తెలుసా!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు సంయుక్తంగా స్పేస్ ఎక్స్-3ని ప్రయోగించారు. ఫాల్కన్ రాకెట్ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
స్పేస్‌ఎక్స్ క్రూ3 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు సంయుక్తంగా స్పేస్ ఎక్స్-3ని ప్రయోగించారు. దీని ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను స్పేస్ స్టేషన్‌కు పంపారు. ఈ టీమ్ ఆరు నెలలపాటు అక్కడే ఉంటి పరిశోధనలు చేయనుంది. వాతావరణం సహకరించని కారణంగా ఇటీవల నాలుగు పర్యాయాలు మిషన్ వాయిదా పడింది. అక్టోబర్ 31న తొలిసారి స్పేస్ ఎక్స్ క్రూ3 వాయిదా పడగా.. వాతావరణం సహకరించని కారణంగానే నవంబర్ 3, నవంబర్ 7, 9 తేదీలలో మిషన్ వాయిదా వేశారు.
నవంబర్ 11న విజయవంతంగా నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు క్రూ3 మిషన్‌ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపారు. ఈ మిషన్‌లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ నలుగురు ఆస్ట్రానాట్స్‌ను నింగిలోకి తీసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి క్రూ3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ మిషన్ ద్వారా భారత సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది.
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా ఎగబాకిన బంగారం ధర.. ఏకంగా 50 వేలు దాటేసి.. తాజా ధరలివే..
కమాండర్‌గా ఇండో అమెరికన్..
నాసా, స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ3 మిషన్ కమాండర్‌గా భారత సంతతికి చెందిన అమెరికా వాసి రాజా చారి కమాండర్‌గా వ్యవహరించారు. కేయ్‌లా బారోన్ మిషన్ స్పెషలిస్ట్, టామ్ మార్ష్‌బర్న్ వెటరన్ ఆస్ట్రోనాట్, జర్మనీకి చెందిన ఈఎస్ఏ ఆస్ట్రోనాట్ మత్తియాస్ మౌరర్ లు రాజాచారితో పాటు ఫాల్కన్ రాకెట్ 9 ద్వారా ఐఎస్‌ఎస్ చేరుకున్నారు. ఐఎస్‌ఎస్‌లో అలా గాల్లో తేలిపోవడం ఓ వజ్రం కాంతివంతంగా మెరుస్తున్నట్లు అనిపించిందని మత్తియాస్ అన్నారు. చాలా థ్రిల్లింగ్‌గా ఉందని, అంతా హ్యాపీ అని పేర్కొన్నారు.
Four new astronauts through the hatch and seven crewmembers total on the @Space_Station!
— NASA (@NASA) November 12, 2021
After almost exactly a day from launch, #Crew3 is aboard the orbiting laboratory. pic.twitter.com/QJoBUsJcsj
నాసా ప్రకటన..
స్పేస్ ఎక్స్ క్రూ3 ఐఎస్ఎస్ చేరుకోగానే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ సానా ట్వీట్ చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు నలుగురు కొత్త రెసిడెంట్స్ వచ్చారని ట్వీట్‌లో పేర్కొంది. ఈ మిషన్ సభ్యులు 6 నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. రెండు గ్రూపులుగా ఏర్పడి పరిశోధనలు చేయనున్నారు. రష్యా మొదటగా గత ఏడాది డిసెంబర్‌లో తొలి ప్రయోగం చేయగా.. స్పేస్ ఎక్స్ ఫిబ్రవరిలో మిషన్‌ను ఐఎస్ఎస్‌కు పంపింది.
Also Read: 256 జీబీ స్టోరేజ్‌తో రియల్‌మీ కొత్త 5జీ ఫోన్.. ధర ఎంతంటే?
LIVE NOW: The @Space_Station is about to have four new residents!#Crew3 aboard the @SpaceX Crew Dragon Endurance, launched last night, is about to dock to the orbiting laboratory. Docking is expected at 6:32pm ET (23:32 UTC). https://t.co/e5MVWLlmcq
— NASA (@NASA) November 11, 2021
తెలుగు మూలాలున్న కమాండర్..
అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన ఫాల్కన్ 9 రాకెట్‌ను తీసుకెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ3 మిషన్ కమాండర్‌గా వ్యవహరించిన ఆస్ట్రోనాట్ రాజాచారి తెలుగు మూలాలున్న వ్యక్తి. రాజాచారి తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన శ్రీనివాసాచారి పై చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికా మహిళను వివాహం చేసుకున్నారు.
Photo Credit: nasa.gov
రాజాచారి అమెరికాలోనే జన్మించారు. ఆస్ట్రోనాట్ కావాలన్నది రాజాచారి చిన్ననాటి కల. 1995లో అమెరికా ఎయిర్ పోర్స్ అకాడమీలో చేరిన ఆయన 1999లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. మాస్టర్స్ సైతం పూర్తి చేసిన రాజాచారి ఐఎస్ఎస్ పరిశోధనల కోసం 2017లో నాసా ఎంపిక చేసిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2024లో చంద్రుడి మీద నాసా చేయనున్న ప్రయోగాల కోసం చేపట్టనున్న టీమ్‌కు ఎంపికయ్యారు. ఇందులో భాగంగానే తాజాగా క్రూ3 మిషన్ కమాండర్ హోదాలో ఐఎస్ఎస్‌కు వెళ్లారు.